Bigg Boss 3: పునర్నవితో తన రిలేషన్ విషయమై ఓపెన్ అయిన రాహుల్..

news18-telugu
Updated: November 6, 2019, 12:44 PM IST
Bigg Boss 3: పునర్నవితో తన రిలేషన్ విషయమై ఓపెన్ అయిన రాహుల్..
రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి భూపాలం
  • Share this:
తాజాగా స్టార్ మా‌లో  ప్రసారమైన ‘బిగ్‌బాస్ 3’‌లో హైదరాబాద్ ఓల్డ్ సిటీ ధూల్‌పేట్‌కు చెందిన రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. హౌస్‌లో ఎంతమంది పార్టిసిపేట్స్ ఉండగా.. ముఖ్యంగా తోటి కంటెస్టెంట్ శ్రీముఖితో పోటీలో తట్టుకొని నిలబడి ఎక్కువ ఓట్లు సంపాదించుకొని బిగ్‌బాస్ విన్నర్‌గా గెలిచాడు. జూలై 21న ప్రారంభమైన బిగ్‌బాస్ సీజన్ 3 పదిహేను వారాల పాటు ఎంతో ఉత్సాహంగా సాగింది. ఈ షోలో రాహుల్, పునర్నవి లవ్ ట్రాక్ కూడా ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక రాహుల్‌తో తన రిలేషన్ షిప్ ‌పై పునర్నవి పలు న్యూస్ ఛానెల్స్‌తో పాటు యూట్యూబ్ ఛానెల్స్ వేదికగా  స్పందించిన సంగతి తెలిసిందే కదా.  అంతేకాదు ఆమె మాట్లాడుతూ.. రాహుల్ తనకు కేవలం ఒక స్నేహితుడు మాత్రమే అని చెప్పడం కొసమెరుపు. తాజాగా రాహుల్.. ఒక ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పునర్నవితో తన బంధం గురించి చెప్పడం విశేషం.

ఏమైతేనేం ఎంతో ఆసక్తికరంగా సాగిన బిగ్‌బాస్ మూడో సీజన్‌లో అందరు అనుకున్నట్టుగానే రాహుల్ టైటిల్ విన్నర్‌గా నిలిచాడు. అంతకు ముందు కొన్ని పాప్ గీతాలతో అలరించిన రాహుల్.. బిగ్‌బాస్ టైటిల్ గెలిచిన తర్వాత  ఏం చేయబోతున్నడనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
బిగ్‌బాస్ 3 టైటిల్ విజేతగా నిలిచిన రాహుల్(Star Maa/Photo)


ీ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ..  బిగ్‌బాస్ టైటిల్ గెలుస్తానని అసలు అనుకోలేదు. ఇక విజేతగా నన్ను ప్రకటించినపుడు నా తల్లి తండ్రుల  కళ్లల్లో ఆనందం చూసి నేను ఎంతో ఎమోషనల్ అయ్యానని చెప్పుకొచ్చాడు. అంతేకాదు తనకు ఓట్లు వేసి గెలిపించిన అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. మరోవైపు పునర్నవితో తనకు ఎలాంటి రొమాంటిక్ రిలేషన్ షిప్ లేదు. నేను తనను డేట్‌కు పిలిచినపుడు రానని కూడా చెప్పింది. ఆమె జీవితంలో మరో వ్యక్తి ఉన్నారని ఈ సందర్భంగా ప్రస్తావించాడు. పునర్నవి అంటే నాకు ఎంతో గౌరవం. మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని ఇంటర్వ్యూలో వెల్లడించాడు.  బిగ్‌బాస్ షో నన్ను ఎంతగానో మార్చివేసింది. ఈ షోలో పార్టిసిపేట్ చేయడం వల్ల నేను చాలా నేర్చుకున్నానని చెప్పారు. వేరే వాళ్లతో ఎలా బిహేవ్ చేయాలి అనేది నేర్చుకున్నారు. అంతేకాదు సహనంతో ఉండటం ఎలా అనే విషయం ఈ బిగ్‌బాస్ షోతో అర్థమైంది. ఇక ఈ షోలో గెలిచిన డబ్బులతో అమ్మా నాన్నలకు ఒక ఇల్లు కొనిద్దాం అనుకుంటున్నాను రాహుల్ చెప్పుకొచ్చాడు.

 



 
First published: November 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు