Bigg Boss 3: బిగ్ బాస్ టైటిల్ అంటే భయపడుతున్న కంటెస్టెంట్‌లు..

Bigg Boss 3 | బిగ్‌బాస్ టైటిల్  అంటేనే భయపడుతున్నారు కంటెస్టెంట్స్. ఇంట్లో వాళ్లందరినీ విడిచి బిగ్‌బాస్‌లో వంద రోజులు గడిపేది బిగ్‌బాస్ టైటిల్ గెలవడానికే కదా. మరి బిగ్‌బాస్ టైటిల్ విన్నర్ అంటే ఎందుకు  భయపెడుతున్నారు అనే డౌట్ వస్తుంది కదా. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: November 3, 2019, 6:21 PM IST
Bigg Boss 3: బిగ్ బాస్ టైటిల్ అంటే భయపడుతున్న కంటెస్టెంట్‌లు..
బిగ్‌బాస్ 3 తెలుగు టాప్ 5 కంటెస్టెంట్స్ (StarMaa/Photo)
  • Share this:
బిగ్‌బాస్ టైటిల్  అంటేనే భయపడుతున్నారు కంటెస్టెంట్స్. ఇంట్లో వాళ్లందరినీ విడిచి బిగ్‌బాస్‌లో వంద రోజులు గడిపేది బిగ్‌బాస్ టైటిల్ గెలవడానికే కదా. మరి బిగ్‌బాస్ టైటిల్ విన్నర్ అంటే ఎందుకు  భయపెడుతున్నారు అనే డౌట్ వస్తుంది కదా. వివరాల్లోకి వెళితే.. గతంలో తెలుగులో ప్రసారమైన బిగ్‌బాస్ 1, బిగ్‌బాస్ 2 టైటిల్ విజేతలైన శివ బాలాజీ, కౌశల్‌ల జాడ.. ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు.ఇక బిగ్‌బాస్ సీజన్ వన్‌లో గెలిచిన శివ బాలాజీకి సినిమాలో ఏమన్న పెద్దగా పొడిచాడా అంటే సమాధానం లేదు. గెలిచాకా రెండు మూడు ఛానెల్స్ తిరిగి ఓ వారం రోజులు కాస్తంత హడావుడి చేసాడు. ఆ తర్వాత శివ బాలాజీ ఏం చేసాడన్నది కూడా ప్రజలకు తెలియదు. తెలియదు అనే కంటే అసలు శివ బాలాజీ ఎవరనే విషయం ప్రేక్షకులు కూడా మరిచిపోయారు.బిగ్‌బాస్ హౌస్‌లో వెళ్లే ముందు కాస్తో కూస్తో సినిమాలు చేసే శివ బాలాజీ.. బిగ్‌బాస్ సీజన్ వన్ విజేతగా నిలిచిన తర్వాత ఉన్న ఛాన్సులు కూడా లేకుండా పోయాయి.

bigg boss season 1 winner siva balaji sensational comments on bigg boss 3 telugu,bigg boss 3,bigg boss 3 telugu,siva balaji,shiva balaji sensational comments,siva balaji comments on bigg boss 3 telugu,vithika sheru,vithika sheru eliminated this week,mahesh vitta,bigg boss 3 mahesh vitta eliminated,mahesh vitta eliminated,ravi eliminated,ravi eliminated this week,ashu reddy,bigg boss telugu 3,bigg boss 3 ashu reddy,bigg boss telugu season 3,ashu reddy bigg boss,bigg boss,bigg boss ashu reddy,bigg boss 3 telugu promo,bigg boss 3 rohini reddy,bigg boss telugu,ashu reddy bigg boss 3,ashu reddy eliminated,bigg boss 3 contestant ashu reddy,bigg boss 3 contestant ashu reddy details,ashu reddy dubsmash,బిగ్‌బాస్ 3,బిగ్‌బాస్ 3,బిగ్‌బాస్ 3 మహేష్ విట్ట,హౌస్ నుండి ఎలిమినేట్ అయిన మహేష్ విట్ట, అషు రెడ్డి ఎలిమినేషన్,అషు రెడ్డి బిగ్‌బాస్ 3 ఎలిమినేషన్,బిగ్‌బాస్ 3,రవి బిగ్‌బాస్ హౌస్ 3,వితికా షేర్,వితికా షేరు,శివ బాలాజీ,బిగ్‌బాస్ 3పై శివ బాలాజీ సంచలన వ్యాఖ్యలు,
బిగ్‌బాస్ 1 విజేత శివ బాలాజీ (Star Maa/Photo)


బిగ్‌బాస్ మొదటి సీజన్ పక్కనపెడితే.. రెండో సీజన్‌లో ఈ వాడి వేడి మరింత పెరిగింది. ముఖ్యంగా సీజన్‌ 2 విజేతగా నిలిచిన కౌశల్ కోసం ఏకంగా ఆయన పేరు మీద  కౌశల్ ఆర్మీ వెలిసింది. అంతేకాదు ఆయన బిగ్‌బాస్ 2 విజేతగా నిలవాలని ఎన్‌ఆర్ఐలు ర్యాలీలు కూడా తీసారు. మరోవైపు కౌశల్ ఆర్మీ రన్ అంటూ నానా రచ్చ చేసి సంగతి తెలిసిందే కదా. అంతేకాదు బిగ్‌బాస్ విజేతగా కౌశల్ గెలిచిన తర్వాత అతడికి వరుసగా విలన్ ఆఫర్స్ అంటూ సోషల్ మీడియాలో తెగ పుకార్లు షికార్లు చేసాయి. అంతేకాదు అతడిని హీరోగా పెట్టి సినిమాలు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి.  కట్ చేస్తే..బిగ్‌బాస్ 2 విజేతగా నిలిచిన తర్వాత కౌశల్.. ఒకటి రెండు నెలలు మాత్రం కొన్ని షాప్ ఓపెనింగ్స్‌కు రిబ్బన్ కటింగ్‌లు, టీవీ చానెల్స్‌లో ఇంటర్వ్యూలు తప్పించి పెద్దగా కౌశల్ సాధించిదేమి లేదు. తాజాగా ఒక చానెల్ నిర్వహించిన  డిబేట్‌లో పాల్గొని ఎవరు విజేతలు అవుతారనే దానిపై మాట్లాడాడు.  ప్రస్తుతం తెలుగు ప్రజలు కౌశల్‌తో పాటు శివ బాలాజీని పూర్తిగా మరిచిపోయారు.

bigg boss telugu 3,bigg boss 3 telugu,bigg boss,bigg boss 3,bigg boss telugu,bigg boss telugu 3 promo,bigg boss 3 telugu promo,bigg boss telugu season 3 analysis,bigg boss 3 telugu contestents,biggboss3 telugu today bigg boss 3 telugu promo,bigg boss promo today,bigg boss telugu vote,telugu bigg boss 3,bigg boss telugu elimination,bigg boss season 3,bigg boss 3 promo,bigg boss promo,బిగ్ బాస్ తెలుగు 3,బిగ్ బాస్ తెలుగు హోస్ట్,బిగ్ బాస్‌లో ఏం జరిగింది,బిగ్ బాస్ టుడే ఎపిసోడ్,బిగ్ బాస్ టుడే ఎపిసోడ్ హైలైట్స్,బిగ్ బాస్ నాగార్జున,బిగ్ బాస్ కౌశల్ శర్మీ,
బిగ్‌బాస్ 2 విజేత కౌశల్ (ప్రతీకాత్మక చిత్రం )




ఇపుడు ఈ బిగ్‌బాస్ సీజన్ 3 లో రాహుల్, శ్రీముఖి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వీరిద్దరి ఎవరు విజేతగా నిలిచినా.. స్టార్ మా వాళ్లు ఇచ్చే ప్రైజ్ మనీ తీసుకుంటారు. గెలిచిన వారు ఒక వారం రెండు వారాలు వీళ్ల లాగే అన్ని చానెల్స్‌తో పాటు యూట్యూబ్‌కు చెందిన వాటిలో ఇంటర్వ్యూలో ఇస్తారు తప్ప పెద్దగా చేసేదేమి ఉండదంటున్నారు చాలా మంది. మరోవైపు అసలు బిగ్‌బాస్ వంటి పాశ్చాత్య పోకడ ఉన్న ప్రోగ్రామ్స్‌తో భారతీయ సంస్కృతి సంప్రదాయాలను తుంగలో తొక్కుతున్నారని  కొంత మంది సంప్రదాయవాదులు నెటిజన్స్  వాదిస్తున్నారు.

telugu-bigg-boss-3
‘బిగ్‌బాస్ 3 తెలుగు’ప్రతీకాత్మక చిత్రం


బిగ్‌బాస్ వంటి ప్రోగ్రామ్స్‌తో  ఆడియన్స్‌కు తమ టైమ్ వేస్ట్ తప్ప మరేమి లేదని కూడా  అంటున్నారు. దీనితో పిల్లలు,యువత చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. మొత్తానికి బిగ్‌బాస్ ఫస్ట్ సీజన్, సెకండ్ సీజన్‌ల విజేతలుగా నిలిచిన వాళ్లలాగనే  బిగ్‌బాస్ 3 టైటిల్ విన్నర్ కూడా పెద్దగా సాధించేదేమి ఉండదంటున్నారు. మొత్తానికి బిగ్‌బాస్ టైటిల్ అంటేనే భయపడుతున్నారు కంటెస్టెంట్స్.
First published: November 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు