పునర్నవి పేరెంట్స్‌ను కలిసిన రాహుల్ .. కారణం అదేనా

రాహుల్, పునర్నవి.. ఈ రెండు పేర్లకు ఇప్పుడు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్ బాస్ 3 కోసం ఒకే ఇంట్లో మొదలైన వీళ్ళ స్నేహం.. ప్రేమగా మారిందని అందరు చెవులు కొరుక్కున్నారు. తాజాగా రాహుల్ పునర్నవి పేరేంట్స్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది.

news18-telugu
Updated: January 16, 2020, 4:29 PM IST
పునర్నవి పేరెంట్స్‌ను కలిసిన రాహుల్ .. కారణం అదేనా
రాహుల్, పునర్నవి (Instagram/sipligunjrahul)
  • Share this:
రాహుల్, పునర్నవి.. ఈ రెండు పేర్లకు ఇప్పుడు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్ బాస్ 3 కోసం ఒకే ఇంట్లో మొదలైన వీళ్ళ స్నేహం.. ప్రేమగా మారిందని అందరు చెవులు కొరుక్కున్నారు. అంతేకాదు హౌస్‌లో వీళ్ల కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత పునర్నవికి కూడా ఈ ప్రశ్న కామన్ అయిపోయింది. ఇదిలాఉంటే అప్పట్లో నాగార్జున కూడా వీరిద్దరిని ఈ విషయంలో సరదాగా ఒక ఆటాడుకున్నాడు. అయితే ఈ షో తరువాత బిజీ అయిపోయిన వీరిద్దరూ తమ కెరీర్ పై దృష్టి సారించారు. రాహుల్ కెరీర్ ప్రస్తుతం పీక్స్‌లో ఉంది. అటు సింగర్ గానే కాకుండా అటు నటుడిగా అవకాశాలు సొంతం చేసుకుంటున్నాడు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ‘రంగమార్తాండ’లో రాహుల్ అవకాశం పట్టేసాడు. ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాతో రాహుల్‌ నటుడిగా వెండితెరకు పరిచయం కానున్నారు. అయితే ఈ సినిమా యూనిట్ నటీనటులకు ఓ పార్టీ ఇచ్చారు. ఈ వేడుకలో రాహుల్‌తోపాటు పునర్నవి కూడా పాల్గొంది.అంతేకాదండోయ్‌ వీరిద్దరూ ఈ సినిమాలోని ఒక పాట పాడుతూ డ్యాన్స్‌ కూడా చేసారు. రాహుల్ కూడా ఇటీవల పునర్నవి పేరెంట్స్ ను కలిసాడు ఆ ఫోటోలను ఇటీవల ట్విట్టర్ లో పోస్ట్ కూడా చేసాడు.

Anchor Srimukhi sudden entry in between Rahul Sipligunj and Punarnavi Bhupalam relation pk రాహుల్ సిప్లిగంజ్ అంటే ఇప్పుడు మరో పేరు కూడా వెంటనే గుర్తొస్తుంది. గూగుల్ తల్లి కూడా రాహుల్ అంటే బోనస్‌గా మరో ఫోటోను కూడా చూపిస్తుంది. కొందరు అలా తెలియకుండానే ఎందుకో కనెక్ట్ అవుతుంటారు. srimukhi twitter,srimukhi hot,rahul sipligunj,rahul sipligunj punarnavi bhupalam,srimukhi thanks meet,srimukhi music reloaded,srimukhi rahul sipligunj,srimukhi maldives,srimukhi lost bigg boss 3 reasons,nagarjuna,nagarjuna akkiineni,nagarjuna akkineni twitter,bigg boss telugu 3,bigg boss telugu,bigg boss 3 grand finale,bigg boss 3 telugu promo,bigg boss shiva jyothi,bigg boss telugu season 3,bigg boss telugu 3 winner,bigg boss 3 telugu winner,bigg boss 3 telugu contestants,srimukhi,srimukhi patas,srimukhi dance,bigg boss srimukhi,anchor sreemukhi,sreemukhi,ravi srimukhi,srimukhi songs,patas srimukhi,anchor srimukhi,srimukhi dubsmash,srimukhi love story,ali reza and srimukhi,srimukhi ramulamma step,srimukhi ramulamma dance,patas sreemukhi,anchor ravi on sreemukhi,anchor sreemukhi dance,srimukhi,శ్రీముఖి,శ్రీముఖి రాహుల్ సిప్లిగంజ్,రాహుల్ సిప్లిగంజ్ పునర్నవి భూపాలం,శ్రీముఖి థ్యాంక్స్ మీట్,తెలుగు సినిమా
రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి భూపాలం


అయితే అప్పట్లో తనను విన్నర్‌గా గెలిచిపించిన అభిమానుల కోసం తాను, పునర్నవి కలిసి ఓ ప్రైవేట్ ఆల్బమ్ చేస్తామని అప్పట్లో ప్రకటించిన రాహుల్. ప్రస్తుతం ఆ ఆల్బమ్ పర్మిషన్ గురించి పునర్నవి పేరెంట్స్ ను కలిసినట్టు తెలిపాడు. ఈ ఆల్బమ్ లో పునర్నవి నటించబోతోన్నట్లు తెలుస్తోంది. బేబీ అంటూ సాగే ఒక సాంగ్ కు శాంపిల్ రిథమ్ కంపోసింగ్ కూడా చేసినట్టు తెలుస్తోంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: January 16, 2020, 4:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading