రాహుల్ సిప్లిగంజ్‌ కొత్త అవతారం.. ఆశీర్వాదం కోరిన బిగ్‌బాస్ విన్నర్..

బిగ్‌బాస్ 3 విజేతగా నిలిచిన ‘రాహుల్’ (Star Maa/Photo)

గత రెండు బిగ్‌బాస్ విజేతల కన్న మూడో సీజన్ విజేత అయిన రాహుల్ సిప్లిగంజ్.. ఒక వైపు పాటలతో మరోవైపు సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నాడు. 

  • Share this:
    గత రెండు బిగ్‌బాస్ విజేతల కన్న మూడో సీజన్ విజేత అయిన రాహుల్ సిప్లిగంజ్.. ఒక వైపు పాటలతో మరోవైపు సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నాడు.  ఇప్పుడు ఇంటి నుంచి బయటికి వచ్చిన తర్వాత వరస పాటలు పాడుతూ రచ్చ చేస్తున్నాడు ఈయన. ముఖ్యంగా టాప్ హీరోలకు కూడా ఈయన పాటలు పాడేస్తున్నాడు.బిగ్ బాస్ ఇంటికి వెళ్లకముందు మహర్షి సినిమాలో పాలపిట్ట పాట పాడాడు ఈయన. దాంతోపాటు 90ఎమ్ఎల్ సినిమాలో కూడా ఓ పాట పాడాడు. ఇక ఇప్పుడు వచ్చిన తర్వాత ఓ ప్రైవేట్ సాంగ్‌తో పాటు అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో సినిమాలో కూడా పాడేసాడు. తాజాగా విడుదలైన అల వైకుంఠపురములో ఓమైగాడ్ డాడీ సాంగ్ ఈయనే పాడాడు. ఈ పాటలన్ని సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.


    తాజాగా రాహుల్ సిప్లిగంజ్.. కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ముఖ్యపాత్రలో నటిస్తోన్న ‘రంగమార్తాండ’ సినిమాలో ముఖ్యపాత్రను పోషించబోతున్నట్టు రాహుల్ సిప్లిగంజ్ స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గొప్పనటులతో అద్బుతమైన చిత్రంలో భాగం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. నటుడిగా నా తొలి చిత్రమిది. మీ ఆశీర్వాదం కావాలన్నారు. ఈ సినిమాలో జబర్ధస్త్ మాజీ యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా మరో ముఖ్యపాత్రలో నటిస్తోంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: