నక్క తోక తొక్కిన రాహుల్ సిప్లిగంజ్‌...రజినీకాంత్ సినిమాలో ఆఫర్..

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 8, 2020, 1:17 PM IST
నక్క తోక తొక్కిన రాహుల్ సిప్లిగంజ్‌...రజినీకాంత్ సినిమాలో ఆఫర్..
రజినీకాంత్‌తో రాహుల్ సిప్లిగంజ్ (Twitter/Photo)
  • Share this:
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 1 విజేతగా నిలిచిన శివ బాలాజీ... ఆ తర్వా త పెద్దగా పొడిచిందేమి లేదు. బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే ముందు కొద్దో గొప్పో సినిమాలన్న ఉండేవి. బిగ్‌బాస్ సీజన్ 1 విన్నర్‌గా నిలిచిన తర్వాత ఉన్న  అవకాశాలు కూడా రావడం లేదు. ఆ తర్వాత సీజన్ 2 విన్నర్‌గా నిలిచిన కౌశల్ మాత్రం ఏకంగా ఆయన పేరిట కౌశల్ ఆర్మీ అంటూ సోషల్ మీడియాలో పెద్ద హడావుడి నడిచింది. విన్నర్‌గా బిగ్‌బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత మూడు రిబ్బర్ కటింగ్‌లు.. ఆరు ఓపెనింగ్‌లు అంటూ సాగింది. ఆ తరవాత బాలయ్య, రామ్ చరణ్ సినిమాల్లో యాక్ట్ చేయబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి. తీరా కట్ చేస్తే.. ఇపుడు కౌశల్ అంటే ఎవరో ప్రేక్షకులు కూడా మరిచిపోయారు. కానీ నాగార్జున్ హోస్ట్ చేసిన బిగ్‌బాస్ సీజన్ 3 విన్నర్‌గా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్.. మాత్రం ఇంతింతై అన్నట్టు తన క్రేజ్‌ను పెంచుకుంటూ పోతున్నాడు. బిగ్‌బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత కృష్ణవంశీ సినిమా ‘రంగమార్తాండ’లో హీరోగా నటించే ఛాన్స్ కొట్టేసాడు. ఈచిత్రంలో ఏకంగా రాజశేఖర్ కూతురు శివాత్మకతో జోడి కడుతున్నాడు. కట్ చేస్తే.. రాహుల్ సిప్లిగంజ్‌కు మరో అరుదైన అవకాశం తలుపు తట్టింది.

Srimukhi completely dominating Bigg Boss 3 winner Rahul Sipligunj by her craze in YouTube pk బిగ్ బాస్ పుణ్యమా అని రాహుల్ సిప్లిగంజ్ రేంజ్ మారిపోయింది. అంతకుముందు కూడా మంచి క్రేజ్ ఉన్నా కూడా అంచనాలు లేకుండా వచ్చి విన్నర్ అయ్యేసరికి మనోడి స్థాయి పెరిగిపోయింది. దానికితోడు.. srimukhi twitter,srimukhi hot,srimukhi lost bigg boss 3 reasons,nagarjuna,nagarjuna akkiineni,nagarjuna akkineni twitter,bigg boss telugu 3,bigg boss 3,bigg boss 3 telugu,bigg boss,bigg boss 3 winner,bigg boss 3 tamil,bigg boss tamil 3,bigg boss season 3,telugu bigg boss 3,bigg boss telugu,bigg boss 3 grand finale,bigg boss 3 telugu promo,bigg boss shiva jyothi,bigg boss telugu season 3,bigg boss telugu 3 winner,bigg boss 3 telugu winner,bigg boss 3 telugu contestants,srimukhi,srimukhi patas,srimukhi dance,bigg boss srimukhi,anchor sreemukhi,sreemukhi,ravi srimukhi,srimukhi songs,patas srimukhi,anchor srimukhi,srimukhi dubsmash,srimukhi love story,ali reza and srimukhi,srimukhi ramulamma step,srimukhi ramulamma dance,patas sreemukhi,anchor ravi on sreemukhi,anchor sreemukhi dance,srimukhi,sreemukhi dance practice,srimukhi army,bigg boos telugu 3 sreemukhi,srimukhi shows,hema on srimukhi,telugu varthalu, news updates, breaking news, telugu news, news today, daily news, news online, national news, india news, నేషనల్ న్యూస్, న్యూస్ అప్ డేట్స్, తెలుగు వార్తలు, తెలుగు న్యూస్, న్యూస్ అప్ డేట్, బ్రేకింగ్ న్యూస్,వైరల్ న్యూస్,శ్రీముఖి,బిగ్ బాస్ 3,విన్నర్,బిగ్ బాస్ 3 విన్నర్,బిగ్ బాస్ 3 విన్నర్,విన్నర్ శ్రీముఖీ,శ్రీముఖి ఫోన్ నంబర్,విన్నర్ శ్రీముఖి,
బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ (Image: Star MAA)


ఈయన సూపర్ స్టార్ రజినీకాంత్‌ యాక్ట్ చేస్తోన్న సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేయనున్నట్టు సమాచారం. శివ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో మీనా, ఖుష్బూ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. కీర్తి సురేష్ మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈచిత్రంలో రాహుల్ సిప్లిగంజ్ ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. తాజాగా రాహుల్.. రజీనీకాంత్‌తో దిగిన ఫోటోను తన సోషల్ మీడియాలో అకౌంట్‌లో పోస్ట్ చేసాడు. ఈ చిత్రంలో రాహుల్ ఎలాంటి పాత్ర చేయబోతున్నడనేది చూడాలి. మొత్తంగా బిగ్‌బాస్ విజేతగా రాహుల్ సిప్లిగంజ్ మాత్రం వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు.

First published: February 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు