Bigg Boss | వరుణ్ అమాయకత్వం.. కథలు కథలుగా చెప్పిన వితిక...

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో వరుణ్ సందేశ్, వితిక శేరు సందడి చేశారు. టైటిల్ విన్నర్ కాలేకపోయినా అభిమానుల మనసు గెలుచుకున్నారు.

news18-telugu
Updated: November 10, 2019, 5:37 PM IST
Bigg Boss | వరుణ్ అమాయకత్వం.. కథలు కథలుగా చెప్పిన వితిక...
వరుణ్ సందేశ్, వితక
  • Share this:
వరుణ్ సందేశ్ చాలా అమాయకుడు. అది అతడి ముఖం చూస్తేనే తెలుస్తుంది అంటారా. అయితే, ఈ విషయం కూడా తెలుసుకోండి. వరుణ్ సందేశ్ గురించి, అతడి అమాయకత్వం గురించి వితిక శేరు కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసింది. పెళ్లయిన కొత్తలో వరుణ్ సందేశ్ షూటింగ్‌కు వెళ్లేటప్పుడు ఉదయాన్నే ఇంట్లో ఏసీ ఆన్ చేసి వెళ్లేవాడట. ఎందుకలా చేస్తున్నావని అడిగితే.. ఇంటికి వచ్చేసరికి.. అంతా చల్లగా ఉంటుందని చెప్పాడట. కానీ, అలా మనుషులు లేనప్పుడు కూడా ఏసీ వేసి ఉంచడం వల్ల రూ.15వేలు బిల్లు వస్తుందని చెప్పి.. అతడి చేత ఆ అలవాటు మాన్పించిందట. దీంతోపాటు పాల ప్యాకెట్ తీసుకురావడానికి ఓ వ్యక్తికి రూ.100 ఇచ్చి.. మళ్లీ చిల్లర అడగనప్పుడే అతడి అమాయకత్వం తొలిసారి తెలిసిందని వితిక చెప్పింది.

బిగ్ బాస్ చరిత్రలోనే భార్యాభర్తలు కలసి షోలో పాల్గొనలేదు. ఒక్క తెలుగులోనే తొలిసారి భార్యాభర్తలు కలసి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లారు. అలా వరుణ్ సందేశ్, వితిక షేరు కొత్త రికార్డు సృష్టించారు. 12 ఏళ్ల కెరీర్‌లో చాలా ఎత్తుపల్లాలు చూసిన వరుణ్ సందేశ్‌కి బిగ్ బాస్ ద్వారా మరింత క్రేజ్ వచ్చింది. అయితే, ఇప్పుడు సినిమాల్లో అవకాశం కోసం దర్శకులను అడగాలని వితిక సూచిస్తున్నా.. తాను మాత్రం గతంలో ఎప్పుడూ అడగలేదు. ఇకపై అడగను అని వరుణ్ చెబుతున్నాడు.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 10, 2019, 5:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading