news18-telugu
Updated: November 2, 2019, 7:17 PM IST
బిగ్‌బాస్ 3 తెలుగు టాప్ 5 కంటెస్టెంట్స్ (StarMaa/Photo)
బిగ్‌బాస్ 3 తెలుగు చివరి అంకానికి చేరుకుంది. ఫైనల్ విజేత అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఇప్పటికే హౌస్‌లో వరుణ్ సందేశ్, శ్రీముఖి, రాహుల్, బాబా భాస్కర్, అలీ రెజాలు ఉన్నారు. ఐతే.. పోటీ తీవ్రంగా ఉండటంతో ఎవరు విజేతగా నిలుస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తాజాగా జరిగిన ఓటింగ్‌లో రాహుల్‌కు ఎక్కువ ఓట్లు వచ్చి టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ఆ తర్వాత ప్లేస్‌లో శ్రీముఖి నిలిచింది. పటాస్ యాంకర్‌గా శ్రీముఖికి యూత్‌తో మంచి ఫాలోయింగ్ ఉంది. దాన్ని ఆమె బాగానే క్యాష్ చేసుకుంది. ఆ తర్వాత ప్లేస్‌లో వరుణ్ సందేశ్ ఉన్నాడు. తాజాగా ఈ రోజు జరగబోయే ఎపిసోడ్లో బాబా భాస్కర్, అలీ రెజాలు హౌస్ నుండి బిగ్‌బాస్ బయటకు పంపించివేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరగుతోంది. తాజాగా ఫైనల్లో రాహుల్, శ్రీముఖి, వరుణ్ సందేశ్ పోటీలో నిలిచారు. ఈ ముగ్గురిలో శ్రీముఖి, రాహుల్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అంతేకాదు బిగ్‌బాస్ ఫైనల్లో విజేతగా ఎవరు నిలస్తురనే దానిపై బయట జోరుగా బెట్టింగ్స్ కూడా నడుస్తున్నాయి. రేటింగ్స్ విషయంలో కాస్త వెనకబడ్డా.. ఫైనల్ విజేత ఎవరనే దానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మొత్తానికి బిగ్‌బాస్ టైటిల్ 3 విజేతగా ఎవరు నిలుస్తారో మరికొన్ని గంటలు వెయిట్ చేస్తే సరి.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
November 2, 2019, 7:17 PM IST