news18-telugu
Updated: October 29, 2019, 3:21 PM IST
వితికా షేరు (StarMaa/Photo)
తెలుగులో నాగార్జున హోస్ట్ చేస్తోన్న బిగ్‌బాస్ 3 రియాలిటీ షో.. చివరి అంకానికి చేరింది. ఈ వారంతో బిగ్‌బాస్ సీజన్ 3 ముగియనుంది. గ్రాండ్ ఫినాలేకి రాహుల్, వరుణ్, బాబా భాస్కర్, అలీ రెజా, శ్రీముఖి పోటీలో ఉన్నారు. తాజాగా బిగ్‌బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన వితికా షేరు.. బిగ్‌బాస్ విజేతగా తన భర్త వరుణ్ సందేశ్ టైటిల్ గెలుస్తాడని నమ్మకంగా చెబుతోంది. అంతేకాదు వరుణ్ విజయంపై తనకు పూర్తి నమ్మకం ఉందని రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. టాస్క్‌ల్లో వరుణ్ తన కంటూ బాగా ఆడేవాడని తెలిపిన వితికా, బిగ్‌బాస్ హౌస్‌లో ఉండటం మూలానా తనకు ఓపిక వచ్చిందని చెప్పుకొచ్చింది. ఇక ఆడియన్స్ కూడా వరుణ్ సోలోగా ఆడటానికే ఇప్టపడుతున్నారని, అందుకే తాను ఎలిమినేట్ అయినట్టు తెలిపారు. ఇక బిగ్‌బాస్‌కు రావడం వల్ల ఎలాంటి ఆర్భాటాలు, సోషల్ మీడియా సహకారం లేకుండా బతకవచ్చనే నమ్మకం తమకు కలిగిందన్నారు. ఈ షో ద్వారా వచ్చిన రూ. 50 లక్షలను ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటామని చెప్పింది. ఇక పెళ్లైన మూడేళ్ల వరకు మేమెంతో కష్టపడ్డామని చెప్పుకొచ్చింది. మరి వితికా షేరు చెప్పినట్టు బిగ్‌బాస్ విన్నర్‌గా ఆమె భర్త వరుణ్ సందేశ్.. బిగ్‌బాస్ 3 తెలుగు టైటిల్ గెలుస్తాడా ? రూ. 50 లక్షల ప్రైజ్ మనీ అందుకుంటాడా లే దా అనేది చూడాలి.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
October 29, 2019, 1:41 PM IST