Bigg Boss 3 Telugu: పెద్ద ప్లాన్‌తోనే బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి..

Bigg Boss 3 Telugu | ఈ ఆదివారమే నాగార్జున హోస్ట్‌గా బిగ్‌బాస్ సీజన్ 3 గ్రాండ్‌గా ప్రారంభమైన సంగతి తెలిసిందే కదా. 15 మందితో దాదాపు 100 రోజుల పాటు కొనసాగే ఈ సీజన్‌‌లో చాలా మంది ఉన్న అందరి చూపు మాత్రం శ్రీముఖి పైనే ఉంది. ఈ షోలో విజేతగా నిలవడానికి శ్రీముఖి పెద్ద ప్లానే వేసింది.

news18-telugu
Updated: July 24, 2019, 2:41 PM IST
Bigg Boss 3 Telugu: పెద్ద ప్లాన్‌తోనే బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి..
యాంకర్ శ్రీముఖి
news18-telugu
Updated: July 24, 2019, 2:41 PM IST
ఈ ఆదివారమే నాగార్జున హోస్ట్‌గా బిగ్‌బాస్ సీజన్ 3 గ్రాండ్‌గా ప్రారంభమైన సంగతి తెలిసిందే కదా. 15 మందితో దాదాపు 100 రోజుల పాటు కొనసాగే ఈ సీజన్‌‌లో చాలా మంది ఉన్న అందరి చూపు మాత్రం శ్రీముఖి పైనే ఉంది. ఈ షోలో శ్రీముఖి.. 13వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఐతే ఈ షోలో పార్టిసిపేట్ చేయడానికి శ్రీముఖి భారీ ప్లాన్‌తోనే వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ యాంకర్.. తన పేరు మీద శ్రీముఖి ఆర్మీని క్రియేట్ చేసుకొని రంగంలోకి దిగింది. ఇప్పటికే శ్రీముఖి ఒక వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ఇప్పటి వరకు తనను ఎలా అభిమానించారో.. ఇపుడు కూడా ఆ అభిమానాన్ని అలాగే కొనసాగించాలని కోరింది. అంతేకాదు తనను అభిమానిస్తున్న వారందరి సపోర్ట్ తనకు కావాలంది. ఏమైనా ‘బిగ్‌బాస్ 3’ హౌస్‌లోకి శ్రీముఖి పెద్ద ప్లాన్‌తోనే ఎంట్రీ ఇచ్చినట్టు అర్ధమవుతుంది.

First published: July 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...