Bigg Boss Telugu 3: శ్రీముఖి కోసం మేమంతా బకరాలయ్యాం...హౌస్ మేట్స్ ఆరోపణలు

శ్రీముఖి వల్ల అందరూ బలయ్యారని, కేవలం శ్రీముఖిని విన్నర్ చేసేందుకు మేమంతా బకరాలం అయ్యామని, బిగ్ బాస్ నిర్వాహకులు తనను ఫైనల్ షోకు రావాలని కోరారని అయితే వెళ్లి అవమాన పడటం ఎందుకని ఆహ్వానం తిరస్కరించానని హేమ తెలిపారు.

news18-telugu
Updated: October 28, 2019, 3:27 PM IST
Bigg Boss Telugu 3: శ్రీముఖి కోసం మేమంతా బకరాలయ్యాం...హౌస్ మేట్స్ ఆరోపణలు
శ్రీముఖి (Image : star maa)
  • Share this:
బిగ్‌బాస్ తెలుగు సీజన్3లో చివరి అంకం మొదలైంది. అయితే మొదటి రెండు సీజన్లలో ఎప్పుడూ లేనంతగా వివాదాస్పదం అవుతోంది. ముఖ్యంగా బిగ్‌బాస్ మొత్తం కేవలం ఒకే కంటెస్టెంట్ కోసం డిజైన్ చేశారా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ముఖ్యంగా అందరి వేళ్లూ శ్రీముఖి వైపే చూపిస్తున్నారు. గతంలో హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన హిమజ శ్రీముఖిపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. బిగ్‌బాస్‌కు అసలైన బాస్ శ్రీముఖే అంటూ ఆరోపణలు చేసింది. టాస్క్‌లు శ్రీముఖికి నచ్చితేనే టెలికాస్ట్ అవుతాయని లేకుంటే అసలు టీవీలో టెలికాస్ట్ కావని బాంబు పేల్చింది. ఇక తాజాగా మరో కంటెస్టెంట్ హేమ కూడా బిగ్‌బాస్ నిర్వాహకులపై మండిపడింది.

శ్రీముఖి వల్ల అందరూ బలయ్యారని, కేవలం శ్రీముఖిని విన్నర్ చేసేందుకు మేమంతా బకరాలం అయ్యామని, బిగ్ బాస్ నిర్వాహకులు తనను ఫైనల్ షోకు రావాలని కోరారని అయితే వెళ్లి అవమాన పడటం ఎందుకని ఆహ్వానం తిరస్కరించానని హేమ తెలిపారు.
Published by: Krishna Adithya
First published: October 28, 2019, 3:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading