Bigg Boss Telugu 3: బిగ్‌బాస్ మొత్తం శ్రీముఖి కోసమే డిజైన్ చేశారా...?

తాజాగా శ్రీముఖి గెలిచిన కొన్ని టాస్కులు ప్రత్యేకంగా ఆమె కోసమే డిజైన్ చేశారా అన్నట్లు ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. గతంలో హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన హిమజ సైతం ఇలాంటి ఆరోపణలే చేసింది.

news18-telugu
Updated: October 29, 2019, 10:56 PM IST
Bigg Boss Telugu 3: బిగ్‌బాస్ మొత్తం శ్రీముఖి కోసమే డిజైన్ చేశారా...?
ఏడుస్తున్న శ్రీముఖి (Image:Star MAA)
  • Share this:
బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో టైటిల్ విన్నర్ ఎవరనే దానిపై చర్చ నడుస్తోంది. అయితే ఇఫ్పుడు బిగ్ బాస్ విన్నర్ రేసులో శ్రీముఖి ముందు వరుసలో నిలిచింది. అయితే టైటిల్ విన్నర్ కూడా శ్రీముఖే గెలిచే చాన్స్ ఉందని తేలడంతో ఒక్కసారిగా నెటిజన్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా శ్రీముఖి గెలిచిన కొన్ని టాస్కులు ప్రత్యేకంగా ఆమె కోసమే డిజైన్ చేశారా అన్నట్లు ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. గతంలో హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన హిమజ సైతం ఇలాంటి ఆరోపణలే చేసింది. అంతేకాదు మహేష్ విట్టా సైతం ఈ రకమైన విమర్శలే చేశాడు. ఎవరైనా దెబ్బ తగలించుకోగానే ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి అందరికన్నా ముందుగా రెస్పాండ్ అవుతుందని, ఆమె ఓవర్ యాక్షన్‌కు నిదర్శనమని అన్నాడు.

అంతేకాదు శ్రీముఖిని విన్నర్‌ను చేసేందుకే ఆమెకు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్న హిమజ లాంటి వాళ్లను ఎలిమినేట్ చేశారని, ట్విట్టర్ వేదికగా ఆమె ఫ్యాన్స్ మండి పడుతున్నారు. అయితే అటు శ్రీముఖ ఫ్యాన్స్ సైతం ఇదంతా కావాలని చేస్తున్న దుష్ప్రచారం అని, శ్రీముఖి చాలా జెన్యూన్ గా ఆడుతోందని వారు వాదిస్తున్నారు.

First published: October 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>