Bigg Boss 3: బిగ్‌బాస్ షోలో ఎమోషనల్ అయిన వితిక.. క్యారెక్టర్ లెస్ అంటూ ధ్వజం..

Bigg Boss 3 | తొలి రెండు బిగ్‌బాస్‌తో పోలిస్తే ‘బిగ్‌బాస్ 3’ ప్రారంభం కాకముందు నుంచే వివాదాస్పదం అయింది. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఈ షో కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్సే వస్తోంది.

news18-telugu
Updated: August 16, 2019, 9:36 AM IST
Bigg Boss 3: బిగ్‌బాస్ షోలో ఎమోషనల్ అయిన వితిక..  క్యారెక్టర్ లెస్ అంటూ ధ్వజం..
వరుణ్ సందేశ్ వితికా షెరూ ఫైల్ ఫోటోస్ (source: Twitter)
  • Share this:
తొలి రెండు బిగ్‌బాస్‌తో పోలిస్తే ‘బిగ్‌బాస్ 3’ ప్రారంభం కాకముందు నుంచే వివాదాస్పదం అయింది. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఈ షో కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్సే వస్తోంది. అంతేకాదు షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ ఇంట్లో చేసే రచ్చ మాములుగా లేదు. నిన్నటి ఎపిసోడ్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు మధ్య ఎంతో సందడిగా సాగింది. తాజాగా నిన్న జరిగిన ఎపిసోడ్‌లో స్త్రీ, పురుషుల మధ్య సమానాత్వం లాంటి అంశాలపై కంటెస్టెంట్స్ మధ్య ఓ రేంజ్‌లో చర్చలు జరిగాయి. ఆడవాళ్లు గొప్పనా.. లేక మగవాళ్లు గొప్పనా అనే అంశంపై బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్య చర్చలు వివాదాల వరకు వెళ్లాయి. ఈ విషయంలో ఎవరి వాదన వారు వినిపించారు. ఈ సందర్భంగా మగవాళ్లు ఎంతమందితో నైనా మాట్లాడవచ్చు. ఎవరితోనైనా ఉండొచ్చని రవి, మహేష్ విట్ట అనగా.. వారిపై ఓ వితికా షేరు, అషు, పునర్నవిలు ఓ రేంజ్‌లో పంచ్ ‌లు విసిరారు.



bigg boss 3 telugu,bigg boss 3,ali reza,bigg boss 3 telugu promo,bigg boss 3 telugu latest promo,bigg boss telugu season 3,bigg boss season 3,bigg boss telugu 3,bigg boss promo,bigg boss promo today,bigg boss 3 promo,bigg boss,bigg boss 3 contestants,ali reza wife,himaja,bigg boss telugu,ali reza vs himaja,ali reza bigg boss,telugu bigg boss,ali reza and himaja fight,Bigg Boss 3, TeluguBigg boss, reality show, Srimukhi, Himaja, Ali Reza
బిగ్ బాస్ లోగో






పెళ్లి చేసుకున్నామనే ఒకే ఒక కారణంగా ఆడవాళ్లు మగవారి కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. పుట్టింటిటిని కాదని అత్తింటినే సర్వస్వంగా భావిస్తారు. ఇక వితిక ఐతే.. సమాజంలో ఆడవాళ్ల అణిచివేతపై ఓ రేంజ్‌లో ఎమోషనల్ అయింది. వితిక ఎమోషనల్‌గా మాట్లాడుతుంటే.. వరుణ్ మాత్రం ప్రశాంతంగా కనిపించాడు.

మరోవైపు పునర్నవి మాట్లాడుతూ.. ఓ అబ్బాయి వెళ్లి నలుగురు అమ్మాయిలతో మాట్లాడితే ఎవరు ఏమి అనరు. అదే అమ్మాయి వెళ్లి అబ్బాయితో మాట్లాడితే.. క్యారెక్టర్ లెస్ అని ముద్రవేస్తారు.  ఇది నేటి సమాజం అమ్మాయిలకు ఇస్తున్న గౌరవం అంటూ పునర్నవి కాస్తంత ఎమోషనల్ అయింది. మరోవైపు ఈ వారం ఎలిమినేషన్ లిస్టులో శివజ్యోతి, రాహుల్,శ్రీముఖి, రవి, రోహిణి, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్ ఉన్న విషయం తెలిసిందే కదా. మొత్తానికి ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.
Loading...

First published: August 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...