Bigg Boss: రాహుల్, పునర్నవి బ్రేకప్..గర్ల్‌ ఫ్రెండ్ ఉందని విషయం తెలియగానే...

హోస్ట్ నాగార్జున సైతం రాహుల్, పునర్నవి తన కామెంట్స్ తో ఇద్దరినీ ఒకటి చేయాలని ప్రయత్నం చేశారనే టాక్ కూడా వినిపించింది. అయితే తాజాగా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాహుల్ జీవితం గురించి రహస్యాలన్నీ ఒక్కోటి బయటకు వస్తున్నాయి.

news18-telugu
Updated: November 5, 2019, 6:25 PM IST
Bigg Boss: రాహుల్, పునర్నవి బ్రేకప్..గర్ల్‌ ఫ్రెండ్ ఉందని విషయం తెలియగానే...
Star maa
  • Share this:
బిగ్‌బాస్ షోలో అత్యధిక ఓట్లతో గెలిచిన రాహుల్ సిప్లిగంజ్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ అనే చెప్పవచ్చు. అయితే బిగ్ బాస్ షోలో రాహుల్ సిప్లిగంజ్ కు అంత పేరు వచ్చిందంటే అందుకు పునర్నవితో ఇద్దరికీ ఏర్పడిన కెమిస్ట్రీనే కారణమని ఫ్యాన్స్ అంటుంటారు. వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీని బిగ్ బాస్ నిర్వహాకులు సైతం బాగా వాడేసుకున్నారనే చెప్పవచ్చు. హోస్ట్ నాగార్జున సైతం రాహుల్, పునర్నవి తన కామెంట్స్ తో ఇద్దరినీ ఒకటి చేయాలని ప్రయత్నం చేశారనే టాక్ కూడా వినిపించింది. అయితే తాజాగా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాహుల్ జీవితం గురించి రహస్యాలన్నీ ఒక్కోటి బయటకు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే రాహుల్, పునర్నవి ఇద్దరూ తాము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని, బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కేవలం స్నేహితుల్లాగానే మిగిలిపోతామని తేల్చేశారు. రాహుల్ ఫ్యాన్స్‌కు మాత్రం ఇద్దరూ కలిస్తే బాగుంటుందని అనుకున్నారు.

అయితే ఇటీవలే రాహుల్ గురించి ఇంటర్వ్యూ ఇచ్చిన అతడి సోదరుడు నిఖిల్ కిరణ్ మాత్రం బాంబు లాంటి వార్త పేల్చేశాడు. రాహుల్‌కి అందరి లాగానే కాలేజీ బయట క్రష్ ఉందని, గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పేశాడు. అయితే ఈ విషయం తెలిస్తే పునర్నవి ఎలా రియాక్ట్ అవుతుందా అని రాహుల్ ఆర్మీ ఎదురుచూస్తుంది.

First published: November 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు