మా ఇంటిని కూల్చేసారు.. బిగ్ బాస్ 3 ఫేమ్ హిమజ ఎమోషనల్ వీడియో..

ఏదైనా ఓ చోట నెల రోజులు ఉంటేనే ఏదో తెలియని బాండ్ ఏర్పడిపోతుంది. అక్కడ్నుంచి రావాలంటే మనసు ఏదోలా ఉంటుంది. అలాంటిది ఒకే ఇంట్లో మూడు నెలలకు పైగా ఉండి.. అక్కడ్నుంచి బయటికి..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 22, 2019, 10:09 PM IST
మా ఇంటిని కూల్చేసారు.. బిగ్ బాస్ 3 ఫేమ్ హిమజ ఎమోషనల్ వీడియో..
హిమజ ఫైల్ ఫోటో
  • Share this:
ఏదైనా ఓ చోట నెల రోజులు ఉంటేనే ఏదో తెలియని బాండ్ ఏర్పడిపోతుంది. అక్కడ్నుంచి రావాలంటే మనసు ఏదోలా ఉంటుంది. అలాంటిది ఒకే ఇంట్లో మూడు నెలలకు పైగా ఉండి.. అక్కడ్నుంచి బయటికి వచ్చినపుడు కచ్చితంగా ఏదో పోగొట్టుకున్న ఫీల్ అయితే వస్తుంది. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. బిగ్ బాస్ 3 హౌజ్ ఇప్పుడు కూల్చేసారు స్టార్ మా యాజమాన్యం. దాంతో ఎమోషనల్ అవుతున్నారు ఇంటి సభ్యులు. ముఖ్యంగా కంటెస్టెంట్ హిమజ అయితే కాస్త ఎక్కువగానే ఎమోషనల్ అయిపోయింది. ఈ ఇంటిని పడగొడుతున్నారు కానీ అక్కడున్న జ్ఞాపకాలు మాత్రం ఎప్పుడూ అలాగే పదిలంగా ఉంటాయంటూ పోస్ట్ చేసింది. ఆ వీడియో చూసి అభిమానులు కూడా అదే ఫీల్ అవుతున్నారు.

ఈ సారి బిగ్ బాస్ 3లో మోస్ట్ రెబలిస్టిక్ కంటెస్టెంట్ అంటూ పేరు తెచ్చుకుంది హిమజ. ఈమె చివరి వరకు ఉంటుందేమో అనుకున్నారు కానీ మధ్యలోనే ఎలిమినేట్ అయింది. అప్పట్లో హిమజ ఎలిమినేషన్‌పై కొన్ని అనుమానాలు కూడా వచ్చాయి. ఏదేమైనా కూడా బిగ్ బాస్ 3 ఇంటిని కూల్చేయడంతో మరోసారి వార్తల్లోకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ.
First published: November 22, 2019, 10:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading