Bigg Boss 3: నాగార్జునకు కూడా ఒక బిగ్‌బాస్ ఉన్నారు.. ఎవరో తెలుసా..

నాగార్జున అక్కినేని బిగ్‌బాస్ 3కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా నాగార్జున తన బిగ్‌బాస్ ఎవరో చెప్పారు.

news18-telugu
Updated: October 20, 2019, 9:06 PM IST
Bigg Boss 3: నాగార్జునకు కూడా ఒక బిగ్‌బాస్ ఉన్నారు.. ఎవరో తెలుసా..
బిగ్‌బాస్ తెలుగు హోస్ట్ నాగార్జున (Star Maa)
news18-telugu
Updated: October 20, 2019, 9:06 PM IST
నాగార్జున అక్కినేని బిగ్‌బాస్ 3కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే కదా. ముందుగా ఈ  రియాలిటి షో ప్రసారమయ్యేటపుడు ఈ షోను విమర్శించాడు. అలా విమర్శించిన షోకు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా నాగార్జున.. స్టార్ మా నిర్వహిస్తున్న స్టార్ మా అవార్ట్స్ 2019 అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. బిగ్‌బాస్ షోలో అందరికీ నేను బాస్ అయితే.. నా జీవితంలో మాత్రం బిగ్‌బాస్ ఎప్పటికీ తన భార్య అమలే అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు. అంతేకాదు ‘స్టార్ మా’ ప్రకటించిన ఈ అవార్డును తన సతీమణి అమల చేతుల మీదుగా అందుకున్నారు. ఇక స్టార్ మా నిర్వహిస్తున్న బిగ్‌బాస్ 3 కార్యక్రమం ఈ రోజుతో 12 వారాలు పూర్తి చేసుకోబోతుంది. ఈ సందర్భంగా ఈ రోజు ఎలిమినేషన్ ప్రక్రియలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై ఆసక్తి నెలకొంది.

First published: October 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...