రాహుల్ పై అలిగిన పునర్నవి.. అసలు కారణం అదేనా..

బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో ప్రత్యేకమైన క్రేజ్‌ తెచ్చుకున్నవారిలో రాహుల్‌, పునర్నవిలు మొదటి వరుసలో ఉంటారు. అయితే రాహుల్‌, పునర్నవి లవ్‌లో ఉన్నారనే ప్రచారం జరిగింది. తాజాగా పునర్నవి.. రాహుల్ పై అలిగినట్టు టెలివిజన్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

news18-telugu
Updated: February 26, 2020, 4:50 PM IST
రాహుల్ పై అలిగిన పునర్నవి.. అసలు కారణం అదేనా..
రాహుల్, పునర్నవి (Instagram/sipligunjrahul)
  • Share this:
బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో ప్రత్యేకమైన క్రేజ్‌ తెచ్చుకున్నవారిలో రాహుల్‌, పునర్నవిలు మొదటి వరుసలో ఉంటారు. అయితే రాహుల్‌, పునర్నవి లవ్‌లో ఉన్నారనే ప్రచారం జరిగింది. ఐతే వారిద్దరు ఆ వార్తలను ఖండించారు. తాము ఇద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని స్పష్టం చేశారు. ఆ షో తర్వాత వీరిద్దరు కలిసి పలు వేదికలపై సందడి చేశారు. అంతేకాదు కలిసి తిరగడం.. ఎక్కడికెళ్లినా కలిసే కనిపించడంతో నిజంగానే ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు ఎక్కువైపోయాయి. పైగా బయట కూడా కలిసే కనిపిస్తున్నారిద్దరూ. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారేమో అనే వార్తలు కూడా వచ్చాయి.అయితే ఈ విషయంపై ఎప్పుడు అడిగినా రాహుల్ వైపు నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా.. పునర్నవి మాత్రం అలాంటిదేం లేదన్నట్లుగానే సమాధానం చెబుతూ వస్తుంది. ఈ మధ్య పునర్నవి ‘ఒక చిన్న విరామం ’ అనే సినిమా చేసింది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్‌తోనే బిజీగా ఉంది. ఇక సినిమాలు చాలు.. పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని పున్ను ఆలోచిస్తుందంటూ వార్తలొచ్చాయి. అయితే ప్రస్తుతం పునర్నవి.. రాహుల్ పై అలిగినట్టు సమాచారం. ఈ మద్య కాలంలో పునర్నవి.. రాహుల్ ఫోన్ చేస్తే అసలు రెస్పాండ్ అవ్వడం లేదట. ఆ తర్వాత కాల్ బ్యాక్ చేయడం లేదు. కనీసం మెసేజ్ లకు రిప్లై ఇవ్వడం లేదని చెప్పి తన సన్నిహితులతో బాధ పడిందట పునర్నవి.  కొన్ని రోజులుగా రాహుల్ నుండి రెస్పాండ్ రాకపోవడంతో అతడికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట. ప్రస్తుతం రాహుల్ చాలా బిజీగా ఉండటం వల్ల ఆయన పున్నుకు రిప్లై ఇవ్వలేక పోవచ్చు అంటూ సన్నిహితులు, అభిమానులు చెబుతున్నా.. ఐ హార్టు అంటోందట పునర్నవి. ఏదేమైనా ప్రేమ దోమ ఏమీ లేనప్పుడు ఎవరి కెరీర్‌లు వారు చూసుకోక ఆయన ఫోన్ ఎత్తకుంటే వచ్చే నష్టం ఏంటీ అమ్మడు అంటూ పునర్నవి కొందరు ప్రశ్నిస్తున్నారు.

First published: February 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు