హోమ్ /వార్తలు /సినిమా /

Bigg Boss 3: ప్రసారానికి ముందే సంచలనం.. నిజంగా బిగ్‌బాస్ అలాంటి వాడేనా..

Bigg Boss 3: ప్రసారానికి ముందే సంచలనం.. నిజంగా బిగ్‌బాస్ అలాంటి వాడేనా..

బిగ్‌బాస్ ప్రోమో రిలీజ్

బిగ్‌బాస్ ప్రోమో రిలీజ్

ఎక్కడో విదేశాల్లో పాపులర్ అయిన చాలా కార్యక్రమాలను.. మన నేటివిటికీ తగ్గట్టు వివిధ భాషల్లో ప్రోగ్రామ్స్‌ను వండి వారుస్తున్నారు. తాజాగా తెలుగులో త్వరలో ప్రసారం కానున్న బిగ్‌బాస్ 3.. ప్రసారానికి ముందు కౌస్టింగ్ కౌచ్ ఆరోపణలతో వివాదాల్లో నిలిస్తోంది.

ఇంకా చదవండి ...

ఎక్కడో విదేశాల్లో పాపులర్ అయిన చాలా కార్యక్రమాలను.. మన నేటివిటికీ తగ్గట్టు వివిధ భాషల్లో ప్రోగ్రామ్స్‌ను వండి వారుస్తున్నారు. అదే కోవలో ఎక్కడో విదేశాల్లో పాపులర్ అయిన బిగ్‌బాస్ ప్రోగ్రామ్‌ను ముందుగా హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ప్రసారమై ఎంతో పాపులర్ అయింది. నార్త్‌లో పాపులర్ అయిన ఈ ప్రోగ్రామ్‌ను దక్షిణాదిలో ఆయా భాషల్లోని పాపులర్ నటుల హోస్ట్‌తో మంచి రేటింగే తెచ్చుకుంది. ఇక తెలుగులో బిగ్‌బాస్ మొదటి సీజన్‌కు ఎన్టీఆర్ హోస్ట్ చేసి మంచి పేరే తెచ్చుకున్నాడు. రెండో సీజన్‌కు మాత్రం నాని హోస్ట్‌గా వ్యవహరించాడు. కానీ నాని చేసిన బిగ్‌బాస్ 2 ప్రోగ్రాం కాస్తంత వివాదాలతో ముగిసింది. ఇక త్వరలో నాగార్జున హోస్ట్‌గా ప్రసారం కానున్న బిగ్‌బాస్ 3 ప్రసారం కాకముందే వివాదాల్లో నిలిచింది. తాజాగా  ముందుగా ప్రముఖ న్యూస్ ప్రెజెంటర్ శ్వేతా రెడ్డి బిగ్ బాస్ షో మేనేజ్ మెంట్ పై దుమ్మెత్తి పోసింది. బిగ్ బాస్ 3 అడిషన్స్‌లో సెలక్ట్ అయిన తనను ఓ నిర్మాత ‘బిగ్ బాస్‌ను కన్విన్స్ చేస్తే.. షోలోకి ఎంట్రీ ఇస్తాం’ అంటూ మాట్లాడారంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఆమె వ్యాఖ్యలు దుమారం రేపాయి. తాజాగా ఆమె ఈ  షో‌ను ప్రసారాలు నిలిపివేయాలంటూ హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసారు.

bigg boss 3 telugu,bigg boss telugu season 3,bigg boss 3,bigg boss 3 telugu contestants,bigg boss 3 telugu contestants list,bigg boss telugu,bigg boss 3 telugu promo,bigg boss 3 telugu latest news,bigg boss 3 telugu host,telugu bigg boss 3,bigg boss telugu 3,bigg boss,bigg boss telugu season 3 promo,bigg boss 3 telugu news,bigg boss season 3 telugu,bigg boss 3 contestants telugu,Swetha reddy,బిగ్ బాస్ 3,శ్వేతారెడ్డి,నాగార్జున,కమిట్మెంట్
శ్వేతారెడ్డి, బిగ్ బాస్ 3

మరోవైపు  వర్ధమాన నటి గాయత్రి గుప్తా సైతం అదే తరహా అనుభవాలు తెలిపారు. బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనేందుకు, వెళ్లిన తనకు ఆ షో నిర్వాహకుల నుంచి ఎదురైన చేదు అనుభవాన్ని టీవీ5 ఛానెల్ లో నిర్వహించిన ప్రత్యేక చర్చా వేదిక ద్వారా పంచుకున్నారు. బిగ్ బాస్ షో నిర్వాహకులు  తనను 100 రోజుల పాటు సెక్స్ కు దూరంగా ఎలా ఉంటావని అడిగారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

bigg boss 3 telugu,bigg boss telugu season 3,bigg boss 3 telugu contestants list,bigg boss 3 telugu contestants,bigg boss 3,bigg boss telugu 3,anchor swetha reddy,bigg boss telugu,swetha reddy,bigg boss 3 telugu promo,bigg boss 3 telugu latest news,bigg boss 3 telugu news,bigg boss telugu season 3 promo,swetha reddy bigg boss,bigg boss 3 telugu host,telugu bigg boss 3,bigg boss telugu season 3,bigg boss 3 telugu,bigg boss 3 telugu contestants list,bigg boss 3 telugu promo,gayatri gupta,bigg boss 3,gayatri gupta final for bigg boss 3 telugu,bigg boss 3 telugu host,gayatri gupta conformed as bigg boss 3 telugu contestant,big boss 3 telugu,bigg boss 3 telugu contestants,gayatri gupta in bigg boss 3 telugu,bigg boss telugu 3,bigg boss telugu
గాయత్రి గుప్తా (Image : Instagram)

వీళ్లిద్దరి వ్యాఖ్యలపై బిగ్‌బాస్ షో మీద ఒకింత నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. ఇదంతా ఒక కోణం..నిజంగానే బిగ్‌బాస్ షో నిర్వాహకులు.. వీళ్లను ఈ  రకంగా అడిగారా... లేకపోతే జనాల్లో పాపులర్ కావడానే శ్వేతా రెడ్డి,గాయత్రి గుప్తా బిగ్‌బాస్ 3 వేదికగా పాపులర్ కావాలని ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తున్నారా అనే టాక్ కూడా వినబడుతోంది. లేకపోతే బిగ్‌బాస్ 3 నిర్వాహకులే వీళ్లతో ఇలాంటి  ట్రిక్స్ ప్లే చేయిస్తున్నారా అనే కోణం ఉందా అని మరికొందరు ఆరోపిస్తున్నారు. మొత్తానికి బిగ్‌బాస్ షో ప్రసారానికే ముందు వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. ప్రసారాలు ప్రారంభమైన తర్వాత బిగ్‌బాస్ 3 షో ఎలాంటి సంచలనాలకు వేదికగా నిలస్తుందో చూడాలి.

First published:

Tags: Bigg Boss 3, Jr ntr, Nagarjuna Akkineni, Nani, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు