Bigg Boss Telugu 3: బిగ్‌బాస్‌ హౌస్ నుంచి అషు రెడ్డి ఔట్...

బిగ్ బాస్ హౌస్ నుంచి అషురెడ్డి ఔట్ అయ్యింది. ఆదివారం ఉల్లాసంగా సాగిన ఎలిమినేషన్ రౌండ్ లో అషు ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించాడు.

news18-telugu
Updated: August 25, 2019, 10:16 PM IST
Bigg Boss Telugu 3: బిగ్‌బాస్‌ హౌస్ నుంచి అషు రెడ్డి ఔట్...
బిగ్‌బాస్ 3 కంటెస్టెంట్ అషు రెడ్డి (ట్విట్టర్ ఫోటో)
news18-telugu
Updated: August 25, 2019, 10:16 PM IST
బిగ్ బాస్ హౌస్ నుంచి అశురెడ్డి ఔట్ అయ్యింది. ఆదివారం ఉల్లాసంగా సాగిన ఎలిమినేషన్ రౌండ్ లో అశు రెడ్డి ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించాడు. అషురెడ్డిని హౌస్ మేట్స్ అంతా కలిసి సరదాగా పాటలు పాడుతూ సాగనంపారు. బిగ్ బాస్ హౌస్ లో వివాదాలకు దూరంగా ఉంటూ అందరితో కలుపుగోలుగా ఉన్న అషురెడ్డి ఎలిమినేట్ అవ్వడం ఈ వారం ఖాయమని అందరూ భావించారు. హౌస్ లో మంచితనంతో ఎవరినీ నొప్పించకుండా తన ప్రెజెన్స్ కాపాడుకుంటున్న అషు రెడ్డి...హౌస్ లో ఎక్కువగా డిఫెన్స్ లో ఉంటోందని అందుకే, రేసు నుంచి తప్పుకోవడం ఖాయమని అంతా భావించారు. గత వారం రోజుల నుంచి అషురెడ్డి తన డ్యాన్సులతోనూ, పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేసినప్పటికీ అది కాస్త లేట్ అయ్యిందనే అంతా భావిస్తున్నారు. మిగితా హౌస్ మేట్స్ రేసులో ముందుకు దూసుకెళుతుంటే...అషురెడ్డి మాత్రం కాస్త నెమ్మదించడం ప్రేక్షకులకు అంత రుచించలేదనే చెప్పవచ్చు.

First published: August 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...