Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: September 5, 2019, 9:01 PM IST
మధుమిత బిగ్ బాస్ తమిళ్ (Source: Twitter/Tamil Bigg Boss)
ఇప్పుడు ఈ ఒక్క న్యూస్ దక్షిణాది ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. నిజంగానే ఇప్పుడు ఓ కంటెస్టెంట్ తనను ఈ షోలో మానసికంగా వేధించారని ఫిర్యాదు చేసింది. అయితే ఇది తెలుగులో మాత్రం కాదు.. తమిళ బిగ్ బాస్ షోలో ఈ ఘటన జరిగింది. ఇది తెలిసిన తర్వాత ప్రేక్షకులు కూడా ఈ షోపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే.. తమిళ లేడీ కమెడియన్ మధుమిత బిగ్ బాస్ ఇంట్లో ఉన్నపుడు సుసైడ్ అటెంప్ట్ చేసుకుంది. ఇప్పుడు ఈమె మళ్ళీ తనను ఇంట్లో అంతా కలిసి వేధించారని చెబుతుంది. ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది.

మధుమిత బిగ్ బాస్ తమిళ్ (Source: Twitter/Tamil Bigg Boss)
ఓకే ఓకే సినిమాతో పేరు తెచ్చుకున్న ఈమె.. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఈమె. మధుమిత నటించిన కొన్ని సినిమాలు తెలుగులో కూడా అనువాదం అయ్యాయి. ఈ మధ్యే ఈమె బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టింది. అక్కడే 50 రోజులకు పైగా ఉంది. ఈమె కెప్టెన్ బాధ్యతలను నిర్వహిస్తున్న తరుణంలో ఇంటి సభ్యుల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దాంతో ఒత్తిడి తట్టుకోలేక చేయి కోసుకుంది ఈమె. అక్కడ యుద్ధ వాతావరణం తట్టుకోలేక బయటికి రావాలని ఫిక్స్ అయిపోయి.. ఎలాగైనా బయటకు రావాలని ఏకంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

మధుమిత బిగ్ బాస్ తమిళ్ (Source: Twitter/Tamil Bigg Boss)
దీనికి ముందే తనను ఇంట్లో వాళ్లంతా టార్చర్ చేసారని.. మానసికంగా వేధించారని చెబుతుంది. దీనిపై ఫిర్యాదు కూడా చేసింది. దాంతో వెంటనే ఆమెను హౌస్ నుంచి బయటకు పంపేశారు నిర్వాహకులు.అయితే తనపై విజయ్ టీవీ తప్పుడు కేసు పెట్టిందని కొన్ని రోజుల కింద ప్రెస్ మీట్ పెట్టింది మధుమిత. ఇప్పటి వరకు తనకు రావాల్సిన మొత్తాన్ని కూడా ఈ ఛానెల్ చెల్లించలేదని ఆరోపించింది మధు. ఇప్పుడు ఏకంగా బిగ్ బాస్ షోపైనే పోలీసు కేసు పెట్టింది ఈమె. ప్రస్తుతానికి ఈ రచ్చ పెరుగుతూనే ఉంది. మరోవైపు ఈ విషయంపై కమల్ హాసన్ కూడా చూసి చూడనట్లున్నారని.. తనను వేధించినా కూడా పట్టించుకోలేదని లోక నాయకుడిపై కూడా విమర్శలు చేసింది ఈమె.
Published by:
Praveen Kumar Vadla
First published:
September 5, 2019, 9:01 PM IST