Home /News /movies /

Bigg Boss 3: ‘హలో బ్రదర్’లో నాగార్జున డూప్‌గా నటించింది ఆ స్టార్ హీరోనే..

Bigg Boss 3: ‘హలో బ్రదర్’లో నాగార్జున డూప్‌గా నటించింది ఆ స్టార్ హీరోనే..

‘హలో బ్రదర్’ లో నాగార్జున డూప్‌గా (Youtube/Credit)

‘హలో బ్రదర్’ లో నాగార్జున డూప్‌గా (Youtube/Credit)

నాగార్జున సినీ కెరీర్‌లో ‘హలో బ్రదర్’కు ప్రత్యేక స్థానం ఉంది. ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున తన కెరీర్‌లో ఫస్ట్ టైమ్ డ్యూయల్‌ రోల్లో నటించాడు. ఈ సినిమాలో నాగార్జున డూప్‌గా నటించన హీరో ఎవరో బిగ్‌బాస్ షోలో వెల్లడించాడు.

ఇంకా చదవండి ...
    నాగార్జున సినీ కెరీర్‌లో ‘హలో బ్రదర్’కు ప్రత్యేక స్థానం ఉంది. ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున తన కెరీర్‌లో ఫస్ట్ టైమ్ డ్యూయల్‌ రోల్లో నటించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. తాజాగా బిగ్‌బాస్ షో వేదికగా నాగార్జున ఈ సినిమాలో తన డూప్‌గా ఎవరు నటించారానే విషయమై ఈ షోలో వెల్లడించాడు. ‘హలో బ్రదర్’ సినిమాలో నాగార్జున రెండు సీన్లలో కనిపించే సన్నివేశాల్లో హీరో శ్రీకాంత్ నటించినట్టు నాగార్జున ఈ షోలో వెల్లడించాడు. ఇక హీరోగా శ్రీకాంత్‌కు ఇ.వి.వి. సత్యనారాయణతో మంచి అనుబంధం ఉంది. అంతకు ముందు శ్రీకాంత్ ఇ.వి.వి.సత్యనారాయణ, నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన ‘వారసుడు’ సినిమాలో నటించాడు. ఆ అనుబంధంతోనే నాగార్జున హీరోగా నటించిన ‘హలో బ్రదర్’లో నాగార్జున.. ఇద్దరుగా కనిపించే సన్నివేశాల్లో ఆయనకు డూప్‌గా  నటించాడు శ్రీకాంత్. ఇద్దరి హైట్‌తో పాటు పర్సనాలిటీ ఒకే రకంగా ఉండటంతో ఇ.వివి.సత్యనారాయణ.. శ్రీకాంత్‌ను నాగార్జున డూప్‌గా ‘హలో బ్రదర్’ సినిమాలో నటింపచేసాడు.
    First published:

    Tags: Bigg Boss 3, Nagarjuna Akkineni, Srikanth, Telugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు