Bigg Boss 3: ఇదంత బిగ్‌బాస్ ఆడుతున్న డ్రామానా.. విన్నర్ ఎవరంటే.. ?

నాగార్జున హోస్ట్‌గా చేస్తోన్న బిగ్‌బాస్ 3 విజేత ఎవరో మరికొన్నిగంటల్లో తేలిపోనుంది. ముందు నుంచి  కామెడీ, కామెడీగా.. కాస్తంత కాంట్రవర్సీలతో  ఓ రేంజ్‌లో సాగుతోంది. కానీ బిగ్‌బాస్ షోలో ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదరుచూసే ఎలిమినేసన్  పార్ట్, వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి సోషల్ మీడియాలో ముందుగానే లీకైపోతున్నాయి

news18-telugu
Updated: November 3, 2019, 4:43 PM IST
Bigg Boss 3: ఇదంత బిగ్‌బాస్ ఆడుతున్న డ్రామానా.. విన్నర్ ఎవరంటే.. ?
బిగ్‌బాస్ 3 తెలుగు (Star Maa/Photo)
  • Share this:
నాగార్జున హోస్ట్‌గా చేస్తోన్న బిగ్‌బాస్ 3 విజేత ఎవరో మరికొన్నిగంటల్లో తేలిపోనుంది. ముందు నుంచి  కామెడీ, కామెడీగా.. కాస్తంత కాంట్రవర్సీలతో  ఓ రేంజ్‌లో సాగుతోంది. కానీ బిగ్‌బాస్ షోలో ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదరుచూసే ఎలిమినేసన్  పార్ట్, వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి సోషల్ మీడియాలో ముందుగానే లీకైపోతున్నాయి. కావాలనే బిగ్‌బాస్ నిర్వాహకులే ఈ లీకులు చేస్తున్నారా.. ? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇప్పటి వరకు అన్ని ఎపిపోడ్స్‌కు సంబంధించి ముందే లీకులు ఇచ్చారు. కానీ మహేష్ విట్టా, పునర్నవి భూపాలం ఎపిసోడ్ విషయంలో మాత్రం లీకు వీరులు కావాలనే మిస్ గైడ్ చేసారు. ఆ ఒక్క విషయంలో తప్పించి మిగతా అన్ని వారాల్లో బిగ్‌బాస్ నిర్వాకులు ఏదైతే లీకు చేసారే అదే జరిగింది. తాజాగా నిన్న జరిగిన ఎపిసోడ్ విషయమై లీకులు ఇచ్చారు. అంతేకాదు రాహుల్ బిగ్‌బాస్ విజేతగా ఎన్నికైనట్టు ప్రచారం జరిగింది. తీరా చూస్తే.. బయట పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయం తెలుసుకోవడం  కోసమే ఈ లీకులు చేసినట్టు సమాచారం.

Bigg Boss Telugu 3,bigg boss telugu 3,bigg boss 3 telugu,bigg boss 3,bigg boss 3 telugu promo,bigg boss telugu,bigg boss,bigg boss telugu season 3,bigg boss 3 telugu winner,bigg boss 3 telugu public talk,bigg boss 3 telugu latest promo,bigg boss 3 telugu live,bigg boss 3 telugu full episode,bigg boss 3 telugu contestants,telugu bigg boss 3,bigg boss telugu season 3 analysis by paritala murthy,bigg boss 3 telugu,bigg boss telugu 3,bigg boss 3,bigg boss 3 telugu promo,bigg boss telugu season 3,bigg boss telugu,bigg boss,bigg boss 3 telugu winner,bigg boss 3 winner,bigg boss telugu 3 winner,bigg boss 3 telugu public talk,bigg boss 3 telugu contestants,bigg boss telugu season 3 winner,bigg boss 3 public talk,bigg boss 3 winner telugu,telugu bigg boss 3,బిగ్‌బాస్ సీజన్ 3,
బిగ్‌బాస్ 3 (star maa/Photo)


గతంలో గీతా మాధురి గెలిచినట్టు లీకులు ఒదలారు. దాంతో కౌశల్ ఆర్మీ టీమ్.. అలా ఎలా ముందే బిగ్‌బాస్ విజేతను డిసైడ్ చేస్తారంటూ నానా రచ్చ చేసారు. బిగ్‌బాస్ 3 విషయం వచ్చేసరికి బిగ్‌బాస్ 2 ఉన్నంత హైప్ మాత్రం లేదు. నిన్న జరిగిన ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ 3లో పార్టిసిపేట్ చేసిన వారితో డాన్సులు గట్రా చేయించి హౌస్‌లో నానా హంగామా చేయించారు. కానీ ఈ రోజు ఉదయం మాత్రం నాగార్జున కూడా బిగ్‌బాస్ విషయంలో సోషల్ మీడియాలో జరిగే ప్రచారమంతా హంబక్ అంటూ ట్వీట్ చేసాడు. ఈ రోజు సాయంత్రం నుంచి బిగ్‌బాస్ 3 లైవ్‌లో ప్రసారమవుతోంది. విజేత ఎవరనేది ఈ రోజు మాత్రమే తెలిసే అవకాశం ఉంది. మొత్తానికి బిగ్‌బాస్‌ షో కోసం పెద్ద నిర్వాహకులు పెద్ద గేమే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

First published: November 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు