Bigg Boss 3: బిగ్‌బాస్ 3 విన్నర్ రాహుల్ అయినా.. పారితోషకం విషయంలో వారే టాప్..

గత ఆదివారం ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన బిగ్‌బాస్ సీజన్3లో రాహుల్ విజేతగా ఎంపికైన సంగతి తెలిసిందే కదా. ఈ షో విజేత అయిన రాహుల్ కంటే ఫైనల్ కంటెస్టెంట్స్ ఎక్కువ పారితోషకం అందుకున్నట్టు సమాచారం.

news18-telugu
Updated: November 6, 2019, 11:09 AM IST
Bigg Boss 3: బిగ్‌బాస్ 3 విన్నర్ రాహుల్ అయినా.. పారితోషకం విషయంలో వారే టాప్..
బిగ్‌బాస్ 3 విజేతగా నిలిచిన ‘రాహుల్’ (Star Maa/Photo)
  • Share this:
గత ఆదివారం ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన బిగ్‌బాస్ సీజన్3లో రాహుల్ విజేతగా ఎంపికైన సంగతి తెలిసిందే కదా. ముందు నుంచి హాట్ ఫేవరేట్ కానీ రాహుల్.. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా పుంజుకొని టాప్ ప్లేస్‌లో నిలిచి బిగ్‌బాస్ సీజన్ 3 కిరీటం గెలుచుకున్నాడు. ఫైనల్‌లో రాహుల్‌కు శ్రీముఖి కంటే ఎక్కువ ఓట్లు రావడంతో అతన్నే బిగ్‌బాస్ 3 టైటిల్ విజేతగా ప్రకటించారు. బిగ్‌బాస్ విజేత అయినందుకు రాహుల్‌కు స్టార్ మా యాజమాన్యం నాగార్జున సమక్షంలో చిరంజీవి చేతులు మీదుగా రూ.50లక్షల బహుమతి అందించారు. అసలు విన్నర్‌గా రాహుల్ గెలిచిన ప్రైజ్ మనీ కంటే ఇతర కంటెస్టెంట్స్ ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు సమాచారం. ఫైనల్‌కు చేరిన శ్రీముఖి, వరుణ్ సందేశ్ వంటి వారికి ముందుగా అనుకున్న అగ్రిమెంట్ ప్రకారం రూ. కోటి వరకు చెల్లించినట్టు సమాచారం. యాంకర్‌గా శ్రీముఖి తనకున్న బిజీ షెడ్యూల్స్ అన్ని ఒదులుకొని  బిగ్‌బాస్ ప్రోగ్రామ్‌కు రావడంతో నిర్వాహకులు ఇంత పెద్ద మొత్తంలో అప్పజెప్పినట్టు సమాచారం. మరోవైపు వరుణ్ సందేశ్ కూడా ఇదే తరహాలో రూ.కోటి వరకు  పారితోషకం అందుకున్నట్టు టాక్. కాబట్టి బిగ్‌బాస్ విన్నర్‌గా రాహుల్ గెలచుకున్న దాని కంటే రెండు రెట్లు ఎక్కువగా వీళ్లిద్దరు రెమ్యూనరేషన్ అందుకున్నారని అంతర్గతంగా చెప్పుకుంటున్నారు.


First published: November 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు