Bigg Boss 3: సమంత, చిన్మయి‌కి తప్పని బిగ్‌బాస్ తిప్పలు.. ఆట ఆడుకుంటున్న నెటిజన్లు..

Bigg Boss 3 | టాలీవుడ్ అగ్రనటి కమ్ అక్కినేని ఇంటి కోడలు సమంత, ఆమె ప్రియనేస్తం చిన్మయి. అటొచ్చి ఇటొచ్చి బిగ్ బాస్ వివాదం ఇప్పడు ఈ ఇద్దరికీ చుట్టుకుంది. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: July 19, 2019, 1:22 PM IST
Bigg Boss 3: సమంత, చిన్మయి‌కి తప్పని బిగ్‌బాస్ తిప్పలు.. ఆట ఆడుకుంటున్న నెటిజన్లు..
సమంత,చిన్మయి బిగ్‌బాస్ 3 ఇష్యూ (ఫైల్ ఫోటోస్)
  • Share this:
టాలీవుడ్ అగ్రనటి కమ్ అక్కినేని ఇంటి కోడలు సమంత, ఆమె ప్రియనేస్తం చిన్మయి. అటొచ్చి ఇటొచ్చి బిగ్ బాస్ వివాదం ఇప్పడు ఈ ఇద్దరికీ చుట్టుకుంది. బిగ్‌బాస్ వివాదంపై సామ్, చిన్మయి ఎందుకు స్పందించడం లేదంటూ నెటిజన్స్ వీళ్లిద్దరిని తెగ ట్రోల్స్ చేస్తున్నారు.నాగార్జున హోస్ట్‌గా ప్రారంభం కాబోయే బిగ్ బాస్ షో ప్రసారానికి ముందే షాకుల మీద షాకులు తగులుతున్నాయి.జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి, నటి గాయిత్రి గుప్తా ఫిర్యాదులకు తోడు... ఈ రియాలిటీ షో నిలిపి వేయాలని కోరుతూ తెలంగాణ హై కోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ పేరిట మహిళలను మోసం చేస్తూ లైంగిక దాడులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మీరిద్దరు ఏం చేస్తున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఆడపిల్లల అన్యాయాల గురించి మాట్లాడే మీరు ఎందుకిలా సైలెంట్ గా ఉంటున్నారు? అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

Bigg Boss 3: Samantha akkineni,singer chinmayi trolled by netizen's for Nagarjuna hosting bigg boss 3 telugu reality show controversy,samantha,samantha akkineni,bigg boss,bigg boss 3,samantha akkineni twitter,samantha facebook,samantha instagram,chinmayi twitter,chinmayi facebook,chinmayi instagram,samantha chinmayi bigg boss 3,nagarjuna akkineni samantha chinmayi bigg boss 3,samantha movies,samantha naga chaitanya,bigg boss telugu,samantha chinmayi,nagarjuna confirmed as bigg boss 3 telugu host,akkineni nagarjuna confirmed as bigg boss 3 telugu host,bigg boss 3,bigg boss 3 telugu,samantha interview,bigg boss 3 telugu host,samantha hot videos,bigg boss season 3 telugu,bigg boss 3 telugu contestants list,bigg boss controversy,tollywood,telugu cinema,సమంత,చిన్మయి,సమంత చిన్మయి,సమంత చిన్మయి బిగ్‌బాస్ 3 ఇష్యూ,చిన్మయి సమంత బిగ్‌బాస్ 3 ఇష్యూ,బిగ్‌బాస్ 3 కాంట్రవర్సీ,నాగార్జున సమంత అక్కినేని చిన్మయి బిగ్‌బాస్ 3,
అక్కినేని నాగార్జున


ప్రతి చిన్న విషయం మీద మాట్లాడే సమంత, చిన్మయిలు..బిగ్‌బాస్ పై ఇంత పెద్ద రచ్చ జరుగుతున్న ఎందుకు మాట్లాడటం లేదంటూ నెటిజన్స్ వారిని ఓ ఆట  ఆడేసుకుంటున్నారు. కాగా మహిళల పట్ల లైంగిక దాడికి పాల్పడుతున్నారంటూ గతంలో చిన్మయి పోరాటం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆమె చేసిన పోరాటానికి సమంత కూడా అండగా నిలుస్తూ ట్వీట్లు చేసింది. ఇప్పుడు మహిళల లైంగిక దాడుల మీద అంతగా మాట్లాడిన సామ్, చిన్మయిలు ఇప్పుడు బిగ్‌బాస్ ఇష్యూపై ఎందుకు నోరు విప్పడం లేదు. మామ నాగార్జున హోస్ట్‌గా చేస్తున్నాడని సామ్.. ఆయనతో(నాగార్జున) తన భర్త(రాహుల్ రవీంద్రన్) సినిమా తీశాడని చిన్మయి నోర్లు విప్పడం లేదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మీకు జరిగితే ఒకటి.. వేరే వాళ్లకు జరిగితే మరొకటా అంటూ వారిద్దరిని తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఇదిలావుంటే ఈ ఆరోపణలు నాగార్జునపై కాకపోయినప్పటికీ.. కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు కాబట్టి స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. కాగా ఈ విషయంలో సామ్, చిన్మయి ఇప్పటివరకు ఎలాంటి సమాధానం లేదు.

First published: July 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...