బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో ముగయడానికి పట్టుమని పట్టుమని మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. నవంబర్ 3న జరిగే ఫైనల్లో ఎవరు విజేతగా నిలుస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే వరుణ్ సందేశ్, శ్రీముఖి, బాబా భాస్కర్, రాహుల్, అలీ రెజాలు టాప్ 5లో ఉన్నారు. ఐతే.. పోటీ తీవ్రంగా ఉండటంతో ఎవరు విజేతగా నిలుస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తాజాగా జరిగిన ఓటింగ్‌లో రాహుల్‌కు ఎక్కువ ఓట్లు వచ్చి టాప్ ప్లేస్‌లో నిలిచాడు. మిగిలిన కంటెస్టెంట్స్ కంటే తెలివిగా ఆడటంతో రాహుల్ ఇమేజ్ అమాంతం పెరిగింది. దాంతో రాహుల్ అందరికంటే ముందున్నాడు. ఆ తర్వాత ప్లేస్‌లో శ్రీముఖి నిలిచింది. పటాస్ యాంకర్‌గా శ్రీముఖికి యూత్‌తో మంచి ఫాలోయింగ్ ఉంది. దాన్ని ఆమె బాగానే క్యాష్ చేసుకుంది. ఇక ఇప్పటి వరకు బిగ్‌బాస్ టైటిల్ విజేతగా ఎవరు ఫీమేల్ కంటెస్టెంట్స్ గెలవలేదు కాబట్టి.. శ్రీముఖి బిగ్‌బాస్ 3 టైటిల్ కైవసం చేసుకుంటుందని అందరు జోస్యం చెబుతున్నారు.

బిగ్‌బాస్ 3 తెలుగు టాప్ 5 కంటెస్టెంట్స్ (StarMaa/Photo)ఇక ఐదుగురిలో బాబా భాస్కర్ గేమ్ చాలా డిఫరెంట్‌గా రంజుగా సాగుతోంది. ఈయనకు తెలుగుతో పాటు తమిళ ఫ్యాన్స్ ఓటింగ్ కూడా తోడవ్వడంతో ఆధిక్యతను ప్రదర్శిస్తున్నాడు. మరోవైపు ఇంట్లో జరిగే చిన్నచిన్నగొడవలను తనదైనశైలిలో సర్ధిచెబుతున్నాడు. అందరితో కలుపుగోలుగా ఉండటం బాబా బాస్కర్‌కు కలిసొచ్చే అంశం. ఒకసారి ఇంటి నుంచి బయటకు వెళ్లిన అలీ రెజా అనూహ్యంగా వెనకబడి పోయాడనే టాక్ వినిపిస్తోంది. మొదట టైటిల్ ఫేవరేట్‌గా ఉన్న అలీ రెజా తాజాగా వెనకబడ్డాడు. చివరగా టైటిల్ కోసం అలీ రెజా ఎలాంటి ఎత్తులు వేస్తాడో చూడాలి. మరోవైపు వరుణ్ సందేశ్ కూడా టైటిల్ కోసం తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. సౌమ్యుడిగా కనిపిస్తూ.. ఆడియన్స్ అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. రెండు సార్లు కెప్టెన్‌గా ఉండటంతో కాస్తంత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగింది. ఈ ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచే గ్రాంగ్ ఫినాలే ప్రారంభం కానుంది. మెగాస్టార్ చిరంజీవి..బిగ్‌బాస్ 3 తెలుగు ఫైనల్‌కు ముఖ్యఅతిథిగా రానున్నట్టు సమాచారం. మొత్తానికి నాగార్జున, చిరంజీవి సమక్షంలో బిగ్‌బాస్ ఫైనల్లో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:October 31, 2019, 15:28 IST