Bigg Boss 3: బిగ్‌బాస్ 3 ప్రసారాలు నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్..

ఎక్కడో విదేశాల్లో పాపులర్ అయిన చాలా కార్యక్రమాలను.. మన నేటివిటికీ తగ్గట్టు వివిధ భాషల్లో ప్రోగ్రామ్స్‌ను వండి వారుస్తున్నారు. అదే కోవలో ఎక్కడో విదేశాల్లో పాపులర్ అయిన బిగ్‌బాస్ ప్రోగ్రామ్‌ను మన నేటివిటీకి తగ్గట్టు వివిధ భాషల్లో ప్రసారం అవుతోంది. తాజాగా త్వరలో ప్రసారం కానున్న బిగ్‌బాస్ 3 ప్రోగ్రామ్‌ ప్రసారాలను నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

news18-telugu
Updated: June 20, 2019, 5:24 PM IST
Bigg Boss 3: బిగ్‌బాస్ 3 ప్రసారాలు నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్..
బిగ్‌బాస్ ప్రోమో రిలీజ్
  • Share this:
ఎక్కడో విదేశాల్లో పాపులర్ అయిన చాలా కార్యక్రమాలను.. మన నేటివిటికీ తగ్గట్టు వివిధ భాషల్లో ప్రోగ్రామ్స్‌ను వండి వారుస్తున్నారు. అదే కోవలో ఎక్కడో విదేశాల్లో పాపులర్ అయిన బిగ్‌బాస్ ప్రోగ్రామ్‌ను ముందుగా హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ప్రసారమై ఎంతో పాపులర్ అయింది. నార్త్‌లో పాపులర్ అయిన ఈ ప్రోగ్రామ్‌ను దక్షిణాదిలో ఆయా భాషల్లోని పాపులర్ నటుల హోస్ట్‌తో మంచి రేటింగే తెచ్చుకుంది. ఇక తెలుగులో బిగ్‌బాస్ మొదటి సీజన్‌కు ఎన్టీఆర్ హోస్ట్ చేసి మంచి పేరే తెచ్చుకున్నాడు. రెండో సీజన్‌కు మాత్రం నాని హోస్ట్‌గా వ్యవహరించాడు. కానీ నాని చేసిన బిగ్‌బాస్ 2 ప్రోగ్రాం ఎన్నో విమర్శలను మూట గట్టుకుంది. ఇక తమిళంలో ఈ బిగ్‌బాస్ ప్రోగ్రాంను యూనివర్సల్ నటుడు కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్నాడు. ఒకవైపు రాజకీయాలు.. మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న కమల్ హాసన్..ఇపుడు ముచ్చటగా మూడోసారి ఈ ప్రోగ్రాంను హోస్ట్ చేస్తున్నాడు. త్వరలో తమిళ్‌లో బిగ్‌బాస్ 3 సీజన్ ప్రారంభం కానుంది.

Bigg Boss 3: Petition Filed Against Kamal Haasan Host Bigg Boss 3 Tamil Version, Bigg boss 3,bigg boss 3 kamal haasan,bigg boss 3 nagarjuna,kamal haasan bigg boss 3 in trouble,bigg boss 3 madras high court,kamal haasan,bigg boss,madras high court,bigg boss tamil,kamal haasan speech,madaras high court,kamal haasan controversy,bigg boss 3,delhi high court on kamal haasan,bigg boss 3 tamil anchor,kamal haasan interview,kamal haasan election video,kamal haasan election speech,bigg boss 3 tamil house,bigg boss kamal,bigg boss season 2 fights,kamal haasan defends remark,bigg boss tamil season 2,బిగ్‌బాస్ 3,బిగ్‌బాస్ 3 పై హైకోర్డులో కేసు,బిగ్‌బాస్ 3 పై ప్రసారలపై నిషేధం విధించాలని హైకోర్టులో పిటిషన్,బిగ్‌బాస్ 3 కమల్ హాసన్,బిగ్ బాస్ 3 నాగార్జున,తమిళ బిగ్‌బాస్ 3 పై హైకోర్డులో పిటిషన్,
కమల్ హాసన్ బిగ్‌బాస్ (ఫైల్ ఫోటో)


తాజాగా కమల్ హాసన్ నిర్వహించనున్న బిగ్‌బాస్ 3 కార్యక్రమ ప్రసారానికి స్టే విధించాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తమిళ్లో మూడో సీజన్ ఈ నెల 23 నుంచి ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం గురించి దానిని ప్రసారం చేసే ఛానెల్‌పై మద్రాస్ హైకోర్టులో ఓ న్యాయవాది బుధవారం పిటిషన్ దాఖలు చేసారు. ముఖ్యంగా ఈ ప్రోగ్రాలో పార్టిసిపేట్ చేసేవారు అశ్లీలంగా దుస్తులు ధరిస్తున్నారని , అంతేకాదు ఈ  ప్రోగ్రామ్‌లో డబుల్ మీనింగ్ డైలాగులు కూడా మాట్లాడుతూ యువతను పెడదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నాడు. అందువలన  ఈ ప్రోగ్రాంను ప్రసారం చేసే ముందు సెన్సార్ బోర్డ్ తనిఖీ చేయాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు. దీనిపై కోర్డు త్వరలో తీర్పు వెలువరించనుంది.

 

First published: June 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు