news18-telugu
Updated: June 20, 2019, 5:24 PM IST
బిగ్‌బాస్ ప్రోమో రిలీజ్
ఎక్కడో విదేశాల్లో పాపులర్ అయిన చాలా కార్యక్రమాలను.. మన నేటివిటికీ తగ్గట్టు వివిధ భాషల్లో ప్రోగ్రామ్స్‌ను వండి వారుస్తున్నారు. అదే కోవలో ఎక్కడో విదేశాల్లో పాపులర్ అయిన బిగ్‌బాస్ ప్రోగ్రామ్‌ను ముందుగా హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ప్రసారమై ఎంతో పాపులర్ అయింది. నార్త్‌లో పాపులర్ అయిన ఈ ప్రోగ్రామ్‌ను దక్షిణాదిలో ఆయా భాషల్లోని పాపులర్ నటుల హోస్ట్‌తో మంచి రేటింగే తెచ్చుకుంది. ఇక తెలుగులో బిగ్‌బాస్ మొదటి సీజన్‌కు ఎన్టీఆర్ హోస్ట్ చేసి మంచి పేరే తెచ్చుకున్నాడు. రెండో సీజన్‌కు మాత్రం నాని హోస్ట్‌గా వ్యవహరించాడు. కానీ నాని చేసిన బిగ్‌బాస్ 2 ప్రోగ్రాం ఎన్నో విమర్శలను మూట గట్టుకుంది. ఇక తమిళంలో ఈ బిగ్‌బాస్ ప్రోగ్రాంను యూనివర్సల్ నటుడు కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్నాడు. ఒకవైపు రాజకీయాలు.. మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న కమల్ హాసన్..ఇపుడు ముచ్చటగా మూడోసారి ఈ ప్రోగ్రాంను హోస్ట్ చేస్తున్నాడు. త్వరలో తమిళ్లో బిగ్‌బాస్ 3 సీజన్ ప్రారంభం కానుంది.

కమల్ హాసన్ బిగ్‌బాస్ (ఫైల్ ఫోటో)
తాజాగా కమల్ హాసన్ నిర్వహించనున్న బిగ్‌బాస్ 3 కార్యక్రమ ప్రసారానికి స్టే విధించాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తమిళ్లో మూడో సీజన్ ఈ నెల 23 నుంచి ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం గురించి దానిని ప్రసారం చేసే ఛానెల్‌పై మద్రాస్ హైకోర్టులో ఓ న్యాయవాది బుధవారం పిటిషన్ దాఖలు చేసారు. ముఖ్యంగా ఈ ప్రోగ్రాలో పార్టిసిపేట్ చేసేవారు అశ్లీలంగా దుస్తులు ధరిస్తున్నారని , అంతేకాదు ఈ ప్రోగ్రామ్‌లో డబుల్ మీనింగ్ డైలాగులు కూడా మాట్లాడుతూ యువతను పెడదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నాడు. అందువలన ఈ ప్రోగ్రాంను ప్రసారం చేసే ముందు సెన్సార్ బోర్డ్ తనిఖీ చేయాలని ఆయన తన పిటిషన్లో కోరారు. దీనిపై కోర్డు త్వరలో తీర్పు వెలువరించనుంది.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
June 20, 2019, 5:23 PM IST