BIGG BOSS 3 MARATHI DIVORCE COUPLE BB3 HOUSE DETAILS INSIDE GOES VIRAL NR
Bigg Boss: బిగ్ బాస్ హౌస్ లోకి విడాకులైన దంపతులు ఎంట్రీ.. ఇక దబిడి దిబిడే!
Bigg Boss
Bigg Boss: రియాలిటీ షోలలో మంచి సక్సెస్, మంచి రేటింగ్ లతో దూసుకుపోతున్న షో బిగ్ బాస్. ఈ షో కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, మలయాళం, తమిళ, మరాఠీ ఇలా పలు భాషలలో ప్రసారమవుతుంది. ఈ షో ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది.
Bigg Boss: రియాలిటీ షోలలో మంచి సక్సెస్, మంచి రేటింగ్ లతో దూసుకుపోతున్న షో బిగ్ బాస్. ఈ షో కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, మలయాళం, తమిళ, మరాఠీ ఇలా పలు భాషలలో ప్రసారమవుతుంది. ఈ షో ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది. ఇక అన్ని భాషలలో ప్రసారం అవ్వడమే కాకుండా పలు సీజన్ లను కూడా పూర్తి చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే ఇందులో ఏకంగా విడాకులు తీసుకున్న జంటనే అడుగు పెట్టారు.
మామూలుగా బుల్లితెర వెండితెర సెలబ్రెటీలను, సోషల్ మీడియా స్టార్లను, యాంకర్లను ఇలా ఒక హోదాను మోస్తున్న వాళ్లకి బిగ్ బాస్ లో అవకాశం ఇస్తారు. ఇందులో ఒక రియల్ జంటను కూడా పంపిస్తారు. కానీ ఈసారి విడిపోయిన జంటకు అవకాశం ఇచ్చారు. ఇంతకీ అది తెలుగు బిగ్ బాస్ మాత్రం కాదు.. ప్రస్తుతం మరాఠీ లో కూడా సీజన్ 3 ప్రారంభమయింది.
ఇక ఇందులో మహేష్ మంజ్రేకర్ హోస్టింగ్ చేస్తున్నాడు. ఈ షో ఈ నెల 19వ తేదీన అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఇందులో మొత్తం 15 మంది కంటెస్టెంట్ లు పాల్గొన్నారు. ఇక ఇందులో ఇప్పటివరకు ఏ బిగ్ బాస్ హౌస్ లో కూడా జరగని ట్విస్టు మరాఠీ బిగ్ బాస్ లో జరుగుతుంది. ఎప్పుడో విడాకులు తీసుకున్న జంటను కంటెస్టెంట్లుగా పంపించారు. ఇప్పటివరకు బిగ్ బాస్ చరిత్రలోనే ఇటువంటి జంటను పంపించడం తొలిసారి అని చెప్పవచ్చు.
ఇంతకీ ఆ జంట ఎవరో కాదు నటి స్నేహ వాగ్ ఆమె మాజీ భర్త, నటుడు ఆవిష్కర్ దర్వేకర్. స్నేహకు చిన్న వయసులోనే ఆవిష్కర్ తో పెళ్లి జరిగింది. ఇక కొన్ని రోజులు తమ జీవితం సజావుగా సాగింది. కొంతకాలం తర్వాత స్నేహ తన భర్త తనను వేధిస్తున్నాడంటూ గృహ హింస కేసు పెట్టింది. దాంతో అతడి నుంచి విడాకులు తీసుకుంది. ఇక ఇద్దరు దూరంగా ఉంటూ తమ జీవితాలను తాము చూసుకుంటున్నారు.
కానీ బిగ్ బాస్ వీరిద్దరికీ మరోసారి కలిసే అవకాశం ఇచ్చాడు. అది కూడా ఒక రోజు కాదు ఏకంగా బిగ్ బాస్ పూర్తయ్యేవరకు వాళ్లకు అవకాశం ఇచ్చింది. వీరిద్దరూ ఈ హౌస్ లో ఎంట్రీ ఇవ్వగా.. ఇందులో వీళ్లు మాట్లాడుకుంటారా లేదా పోట్లాడుకుంటారా తెలియదు కానీ బిగ్ బాస్ మాత్రం వీరిని కలిపే ప్లాన్ లో వీరికి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో ఈ జంటను ఆహ్వానించినందుకు బిగ్ బాస్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.