Bigg Boss 3: బి‌గ్‌బాస్ సాక్షిగా వి.వి.వినాయక్‌కు పంచ్ వేసిన నాగార్జున..

బిగ్‌బాస్ 3 గ్రాండ్ ఫినాలేలో నాగార్జున వినాయక్‌కు పంచ్ వేసాడు. హౌస్‌లో టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్స్‌లో ఒకరిని ఎలిమినేట్ భాగంగా దర్శకుడు మారుతి, రాశిఖన్నాను హౌస్‌లో పంపించాడు.ఈ సందర్భంగా నాగార్జున వినాయక్‌పై పంచ్ వేసాడు.

news18-telugu
Updated: November 3, 2019, 7:39 PM IST
Bigg Boss 3: బి‌గ్‌బాస్ సాక్షిగా వి.వి.వినాయక్‌కు పంచ్ వేసిన నాగార్జున..
నాగార్జున, వినాయక్ (File photo)
  • Share this:
బిగ్‌బాస్ 3 గ్రాండ్ ఫినాలేలో నాగార్జున వినాయక్‌కు పంచ్ వేసాడు. హౌస్‌లో టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్స్‌లో ఒకరిని ఎలిమినేట్ భాగంగా దర్శకుడు మారుతి, రాశిఖన్నాను హౌస్‌లో పంపించాడు. ఈ సందర్భంగా బాబా భాస్కర్‌తో వాళ్లతో డాన్స్ చేయించమని పురమాయించాడు. కానీ  మారుతి మాత్రం హీరోయిన్స్‌ హీరోలు డాన్స్ చేయడం ఒకే కానీ.. దర్శకులు డాన్స్ చేయడము ఏమిటి అని అడగగా.. నాగార్జున.. ఈ మధ్యకాలంలో దర్శకులందరు హీరోలవుతున్నారు. అంతేకాదు మా కంటే బాగా నటిస్తున్నారు అంటూ శీనయ్యగా రాబోతున్న వినాయక్‌పై పంచ్ వేసాడు. ఈ మధ్యకాలంలో దర్శకులు నటించడం ఓకేకానీ పూర్తి స్థాయి హీరోగా నటించలేదు. కానీ వి.వి.వినాయక్ మాత్రం పూర్తి స్థాయి కథానాయకుడిగా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. నాగార్జున కూడా వినాయక్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్టు సోషల్ మీడియాలో అందరు చెవులు కొరక్కుంటున్నారు. తన కొడుకు అఖిల్ హీరోగా పరిచయం చేసిన ‘అఖిల్’ సినిమాను వినాయక్ డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచి హీరోగా అఖిల్ కెరీర్‌కు పెద్ద బ్రేకులు వేసిన సంగతి తెలిసిందే కదా. అందుకే నాగార్జున.. వినాయక్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం.

First published: November 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు