Bigg Boss | అవి బిగ్ బాస్ టాస్కులా... కుళాయిల వద్ద సిగపట్లా..

bigg boss 3: వీరి కొట్లాట వీడియోలతో బిగ్‌బాస్‌ను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఫన్నీ మీమ్స్‌తో దుమ్మురేపుతున్నారు. ఇది బిగ్‌బాస్ హౌజా.. లేదంటే కుళాయల వద్ద కొట్టాటలా..? అంటూ సెటైర్లు వేస్తున్నారు.

news18-telugu
Updated: October 21, 2019, 3:12 PM IST
Bigg Boss |  అవి బిగ్ బాస్ టాస్కులా... కుళాయిల వద్ద సిగపట్లా..
బిగ్ బాస్ మీమ్స్
  • Share this:
బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో 13వ వారంలోకి అడుగుపెట్టింది. 15 మందితో ప్రారంభమైన ఈ షోలో ప్రస్తుతం ఆరుగురు మాత్రమే మిగిలారు. ఇక మరో రెండు వారాల్లో గ్రాండ్ ఫినాలే జరగబోతోంది. షో క్లైమాక్స్‌కు చేరే కొద్ది బిగ్ బాస్ టాస్క్‌లు రసవత్తరంగా మారుతున్నాయి. టైటిల్ కొట్టడమే లక్ష్యంగా హౌస్‌మేట్స్ టాస్క్‌లు ఆడుతున్నారు. తమ ఫ్రెండ్‌షిప్‌ని పక్కబెట్టి టాస్క్‌లో గెలిచేందుకే గేమ్ ఆడుతున్నారు. ఐతే గత వారం నామినేషన్ సందర్భంగా జరిగిన హైడ్రామాపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.

ర్యాంకుల కోసం వరుణ్-వితిక జంట శివజ్యోతితో గొడవ పెట్టుకుంది. భార్య అనే కారణంతో వితికకు మూడో ర్యాంకును వరుణ్ త్యాగం చేశాడని.. ఆమె కంటే తానే బెటర్‌గా ఆడానని శివజ్యోతిని నిలదీసింది. వీరి వాడీవేడీ వాదనలతో హౌస్‌లో పెద్ద రచ్చే జరిగింది. అంతేకాదు రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి మధ్య కూడా మాటల యుద్థం జరిగింది. వీరి కొట్లాట వీడియోలతో బిగ్‌బాస్‌ను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఫన్నీ మీమ్స్‌తో దుమ్మురేపుతున్నారు. ఇది బిగ్‌బాస్ హౌజా.. లేదంటే కుళాయల వద్ద కొట్టాటలా..? అంటూ సెటైర్లు వేస్తున్నారు. గ్రామాల్లో నల్లాల వద్ద మహిళలను కొట్లాడినట్లుగా .. తిట్టుకుంటున్నారని జోకులు పేల్చుతున్నారు.

బిగ్‌బాస్‌పై మీమ్స్ ఇక్కడ చూడండి:
First published: October 21, 2019, 3:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading