శ్రీముఖి కొత్త అవతారం.. అభిమానులను పిచ్చెక్కిస్తోన్న బిగ్‌బాస్ భామ..

తెలుగు టీవీ తెరపై శ్రీముఖి మంచి ఫాలోయింగే ఉంది. ఆమె యాంకరింగ్ చేసిన ‘పటాస్’ ప్రోగ్రామ్‌తో బాగా క్రేజ్ సంపాదించుకుంది.తాజాగా శ్రీముఖి స్టార్ మా ప్రోగ్రామ్ కోసం కొత్త అవతారం ఎత్తింది.

news18-telugu
Updated: November 27, 2019, 7:50 AM IST
శ్రీముఖి కొత్త అవతారం.. అభిమానులను పిచ్చెక్కిస్తోన్న బిగ్‌బాస్ భామ..
శ్రీముఖి (Image : star maa)
  • Share this:
తెలుగు టీవీ తెరపై శ్రీముఖి మంచి ఫాలోయింగే ఉంది. ఆమె యాంకరింగ్ చేసిన ‘పటాస్’ ప్రోగ్రామ్‌తో బాగా క్రేజ్ సంపాదించుకుంది. మరోవైపు సోషల్ మీడియాలో శ్రీముకి భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్మాల్ స్క్రీన్ పై ఆమె కాల్షీట్స్ కోసం ఎదురు చూసే ఛానెళ్లు,నిర్మాతలు బోలెడు మంది ఉన్నారు. ఇన్ని ఉన్నా.. ఇంకా ఏదో ఆశించి శ్రీముఖి బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.అక్కడ ఈమెకు బిగ్‌బాస్ కిరీటం కొద్దిలో మిస్ అయిన ఈ రియాలిటీ షోతో బాగానే క్రేజ్ సంపాదించుకుంది. లౌడ్ స్పీకర్ అనే బిరుదు సంపాదించుకున్న శ్రీముఖి.. బిగ్‌బాస్ తర్వాత ఏ ప్రోగ్రామ్ చేస్తుందా అని ప్రేక్షకులతో పాటు అభిమానులు.. ఆసక్తిగా ఎదురు చూసారు. ఈమె స్టార్ మా యాజమాన్యంలో ఒక షో చేయడానికి అగ్రిమెంట్ చేసుకుంది. తాజాగా ఈ ప్రోగ్రామ్‌లో శ్రీముఖి పాట పాడుతూ. స్టెప్పులు వేసింది. అంతేకాదు స్టార్ మా మ్యూజిక్ రీ లోడెడ్ అనే కార్యక్రమంలో భాగంగా శ్రీముఖి ఆడటంతో పాటు పాట పాడి ప్రేక్షకులను సర్ఫ్రైజ్ చేసింది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.First published: November 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>