Bigg Boss 3 | శ్రీముఖి డ్రెస్ డిజైనర్ ఎవరో తెలుసా?

Bigg Boss 3 Srimukhi : బిగ్ బాస్ త్రీ తెలుగు షోలో... మిగతా కంటెస్టెంట్ల కంటే శ్రీముఖీ కాస్త ప్రత్యేకంగా కనిపించిందన్నది ఫ్యాన్స్ మాట. అందుకు కారణం ఆమె వేసుకుంటున్న కాస్ట్యూమ్సే. మరి ఆ డ్రెస్సుల డిజైనర్ ఎవరో తెలుసుకుందాం.

news18-telugu
Updated: November 3, 2019, 10:06 AM IST
Bigg Boss 3 | శ్రీముఖి డ్రెస్ డిజైనర్ ఎవరో తెలుసా?
శ్రీముఖి ఫైల్ ఫోటో
  • Share this:
Bigg Boss 3 Srimukhi : తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు శ్రీముఖి. ఎప్పటికప్పుడు సరికొత్తగా కనిపిస్తూ... ఫ్యాన్ ఫాలోయర్లను పెంచుకుంటున్న ఈ బిగ్ బాస్ బ్యూటీ మెస్మరైజింగ్ సీక్రెట్ ఆమె వేసుకునే కాస్ట్యూమ్సే. శ్రీముఖి వేసుకునే డిజైనర్ డ్రెస్సులన్నీ సరికొత్త అందాలకు కేరాఫ్ అడ్రెస్‌లే. బిగ్ బాస్‌లో చేరాక ఈ బ్యూటీ మరింత అందంగా కనిపించింది. కారణం రోజుకో కొత్త డ్రెస్‌తో దుమ్మురేపడమే. ప్రస్తుతం శ్రీముఖి ఎలా తయారైందంటే... చాలా మంది అమ్మాయిలు ఆమె వేసుకునే డ్రెస్సింగ్ స్టెయిల్స్‌ను ఫాలో అవుతున్నారు. మరి అంతలా యూత్‌ని అట్రాక్ట్ చేసే డ్రెస్సింగ్ డిజైన్స్, జువెలరీని శ్రీముఖి కోసం తయారుచేస్తున్నది ఎవరో తెలుసా... రేఖాస్ బొటిక్. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లో ఈ బొటిక్ ఉంది. ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ కీర్తన సునీల్ దీన్ని నిర్వహిస్తున్నారు.


బిగ్ బాస్ షోలో ఇప్పటివరకూ శ్రీముఖీ... దాదాపు 80కి పైగా కొత్త డ్రెస్సులతో కనిపించింది. వీటన్నింటినీ డిజైన్ చేసింది కీర్తన సునీలే కావడం విశేషం. మీకు తెలుసా... శ్రీముఖి తన డ్రెస్సుల్లో ఎక్స్‌పోజింగ్ ఉండకూడదని చెబుతుందట. తను వేసుకునే డ్రెస్ ఏదైనా ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చేలా ఉండాలని కోరుతుందట. అందుకు తగ్గట్టే అలాంటి డ్రెస్సులే తయారుచేశారు కీర్తన.మోడ్రన్ లుక్‌లో కనిపించాలంటే... కాలేజీ అమ్మాయిలను దృష్టిలో పెట్టుకొని... అలాంటి డ్రెస్‌లు తన కోసం రెడీ చెయ్యమని శ్రీముఖి చెప్పేదని కీర్తన తెలిపారు. శ్రీముఖికి స్లీవ్ లెస్, నెక్ లెస్ డీప్ ఉండే డ్రెస్సులంటే ఇష్టం ఉండవట. తను వేసుకునే డ్రెస్సును చూసి... బ్యూటీఫుల్ ఇండియన్ వుమన్ అని ఎవరైనా అనుకోవాలని శ్రీముఖి చెబుతుంటుందని కీర్తన వివరించారు.శ్రీముఖి డ్రెస్ అడగ్గానే రెడీ చెయ్యలేరు కీర్తన. అసలు ఎలాంటి డ్రెస్ తయారుచెయ్యాలి? ఎలాంటి డిజైన్ ఉండాలి? ఏ కలర్ ఇలా ఎన్నో అంశాల్ని లెక్కలోకి తీసుకుంటారు కీర్తన. అందుకే ఒక్కో డ్రెస్ తయారుచెయ్యడానికి ఆమెకు వారం పడుతుంది. బిగ్ బాస్‌లో మిగతా కంటెస్టెంట్లకు ప్రత్యేకంగా డిజైనర్ లేరు. ఎప్పటికప్పుడు వేర్వేరు డిజైనర్ల నుంచీ వేర్వేరు డ్రెస్సులను మిగతా కంటెస్టెంట్లు వాడారు.శ్రీముఖి మాత్రం ఓన్లీ కీర్తనపైనే ఆధారపడ్డారు. తనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్న కీర్తన... శ్రీముఖి కోసం ఎప్పటికప్పుడు అదిరిపోయే డ్రెస్సులనే డిజైన్ చేసి ఇచ్చారు. ఫలితంగా బిగ్ బాస్ షోలో... శ్రీముఖి ఎప్పుడూ అందంగా, ఆహ్లాదంగా, కలర్‌ఫుల్‌గా కనిపించిందన్నది ఫ్యాన్స్ మాట.హ్యామ్స్‌టెక్‌ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కాలేజీలో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చేసిన కీర్తన... 15 ఏళ్లుగా డిజైనర్‌గా చేస్తున్నారు. నాలుగేళ్లుగా ఆమె టాలీవుడ్, హైదరాబాద్ సెలబ్రిటీలకు డిజైనర్‌గా మారిపోయారు. పటాస్‌తో పాటు భలే ఛాన్సులే, జూలకటక, సరిగమపా, సరిగమప లిటిల్‌ ఛాంప్స్, డ్రామా జూనియర్స్, గోల్డ్‌రష్, కామెడీ నైట్స్, సూపర్‌ సీరియల్‌ ఛాంపియన్‌షిప్‌లకు కూడా డ్రెస్సులు డిజైన్‌ చేస్తున్నారు కీర్తన. ఇంత క్రేజీ డిజనర్ అయివుండి కూడా ఆమె ఎప్పుడూ హంగూ, ఆర్భాటాలకు పోరు. అసలు తన గురించి ఎవరికీ తెలియాలని అనుకోరు. బట్... ఆమె టాలెంట్, ఆమె డిజైన్స్... అందరికీ ఆమెను సుపరిచితురాలిని చేస్తున్నాయి.


అందాల శ్రీముఖి... అదిరిపోయిన ఫొటో షూట్ఇవి కూడా చదవండి :

టాలీవుడ్‌లో జబర్దస్త్ కామెడీ షో... ఇక పంచ్‌ల తుఫానే

ఆ విషయంలో జగన్ కంటే చంద్రబాబే బెస్ట్... కార్మికుల మాట

పోలీసులకు షాక్... సెలవులు రద్దు

IND vs BAN | నేడు ఇండియా బంగ్లాదేశ్ తొలి టీ20... పొగే సమస్య

కేసీఆర్ లెక్క తప్పింది... అంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారో...
Published by: Krishna Kumar N
First published: November 3, 2019, 10:06 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading