బిగ్‌బాస్ క్రేజ్ వాడుకుంటున్న రవికృష్ణ.. హీరోగా బిజీ..

బిగ్‌బాస్ 3 తెలుగు సీజన్‌లో ఒక కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టిన సీరియల్ నటుడు రవికృష్ణ.. ఆ తర్వాత హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు. అంతేకాదు బిగ్‌బాస్‌లో తనదైన శైలిలో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తాజాగా అతను లీడ్‌ రోల్లో..

news18-telugu
Updated: November 3, 2019, 2:07 PM IST
బిగ్‌బాస్ క్రేజ్ వాడుకుంటున్న రవికృష్ణ.. హీరోగా బిజీ..
బిగ్‌బాస్ 3 కంటెస్టెంట్ (Star Maa/Photo)
  • Share this:
బిగ్‌బాస్ 3 తెలుగు సీజన్‌లో ఒక కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టిన సీరియల్ నటుడు రవికృష్ణ.. ఆ తర్వాత హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు. అంతేకాదు బిగ్‌బాస్‌లో తనదైన శైలిలో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. బిగ్‌బాస్‌లోకి వచ్చేంత వరకు కొన్ని సీరియల్స్‌లో నటించినా.. ప్రేక్షకుల్లో అంతగా గుర్తింపు తెచ్చుకోలేదు. ఎపుడైతే.. బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చాడో.. కాస్తంత క్రేజ్ వచ్చింది. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటున్నాడు రవికృష్ణ. ప్రస్తుతం బిగ్‌బాస్‌తో ఇచ్చిన క్రేజ్‌తో హీరోగా స్టార్ మాలో ‘ఆమె కథ’ సీరియల్ తెరకెక్కింది. ఈ సీరియల్‌ను కూడా స్టార్ మా నిర్వాహకులు బిగ్‌బాస్ కంటెస్టెంట్ రవికృష్ణ నటించిన సీరియల్ అంటూ  ప్రచారంతో ఊదరగొట్టేస్తుంది. అంతేకాదు ఈ సీరియల్‌ను బిగ్‌బాస్ ప్రసారమైన రాత్రి 9.30 గంటలకు ప్రసారం చేయనున్నారు. మరి ఈ సీరియల్‌తో రవికృష్ణ తాను కోరుకున్న పాపులారిటీ సంపాదించుకుంటాడా లేదా అనేది చూడాలి.


First published: November 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు