Bigg Boss 3 : బిగ్‌బాస్ 3 ప్రోమో రిలీజ్.. హోస్ట్‌గా ఆ హీరోనే..

Bigg Boss 3 | తెలుగులో ఫస్ట్ సీజన్ జూనియర్ ఎన్టీఆర్ తనదైన స్టైల్‌లో హోస్ట్‌గా చేసి ఆ ప్రోగ్రామ్‌ సక్సెస్ రేట్‌లో అగ్రతాంబూలం అందుకున్నాడు. ఈ నేపథ్యంలోనే వచ్చిన సెకండ్ సీజన్‌కి నాని హోస్ట్‌గా చేశాడు. ఇప్పుడు 3వ సీజన్‌ని టాలీవుడ్ మన్మథుడు నాగార్జున హోస్ట్‌గా చేయనున్నట్లు తెలుస్తుంది.

news18-telugu
Updated: June 16, 2019, 1:27 PM IST
Bigg Boss 3 : బిగ్‌బాస్ 3 ప్రోమో రిలీజ్.. హోస్ట్‌గా ఆ హీరోనే..
బిగ్‌బాస్ ప్రోమో రిలీజ్
news18-telugu
Updated: June 16, 2019, 1:27 PM IST
తెలుగులో ఫుల్ పాపులర్ అయిన్ బిగ్‌బాస్ సిరీస్ 3వ సీజన్ త్వరలోనే మళ్లీ ఆడియెన్స్‌ని అలరించనుంది. ఎప్పుడెప్పుడంటూ ఊరిస్తున్న ఈ ప్రోగ్రామ్ అన్ని పనులు పూర్తి చేసుకుని సందడి చేయనుంది. దీనికి సంబంధించిన ప్రోమోని ఇప్పటికే.. స్టార్ మా యాజమాన్యం తమ అఫీషియల్ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు. దీన్ని బట్టి చూస్తే అతి త్వరలోనే ప్రోగ్రామ్ స్టార్ట్ కానుందని అర్థమవుతోంది.

తెలుగులో ఫస్ట్ సీజన్ జూనియర్ ఎన్టీఆర్ తనదైన స్టైల్‌లో హోస్ట్‌గా చేసి ఆ ప్రోగ్రామ్‌ సక్సెస్ రేట్‌లో అగ్రతాంబూలం అందుకున్నాడు. ఈ నేపథ్యంలోనే వచ్చిన సెకండ్ సీజన్‌కి నాని హోస్ట్‌గా చేశాడు. ఇప్పుడు 3వ సీజన్‌ని టాలీవుడ్ మన్మథుడు నాగార్జున హోస్ట్‌గా చేయనున్నట్లు తెలుస్తుంది.

నిజానికీ బిగ్‌బాస్ ఫస్ట్ సీజన్ అలరించినంతగా సెకండ్సీజన్ ప్రేక్షకులని అలరించలేకపోయింది. దీంతో.. ఈసారి సెకండ్, థర్డ్ సీజన్ సక్సెస్ మొత్తాన్నిమూటగట్టుకోవాలని మాటీవీ యాజమాన్యం భావించి నాగార్జునని రంగంలోకి దించారు. అంతేనా.. కంటెస్టెంట్స్‌ విషయంలోనూ జాగ్రత్త తీసుకుంటున్నారని.. ప్రముఖులని కంటెస్టెంట్స్‌గా తీసుకుంటున్నారని తెలుస్తోంది. కామన్ మ్యాన్ ఎంట్రీస్ కష్టమేనని కూడా వినిపిస్తోంది. ఇవన్నీ నిజమో, కాదో తేలాలంటే.. జూలై నెలాఖరు వరకూ వెయిట్ చేయకతప్పదు..

First published: June 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...