
బాబా భాస్కర్, నాగార్జున
ఆ డబ్బును శ్రీముఖి, రాహుల్, బాబా ముగ్గురూ తిరస్కరించారు. చివరకు రూ. 25 లక్షలు ఇస్తామని మరో డీల్ తీసుకొచ్చారు. దాన్ని కూడా ముగ్గురు ఇంటి సభ్యులు తిరస్కరించారు.
బిగ్ బాస్ 3లో మంచి ఎంటర్టైనర్గా పేరు తెచ్చుకున్న బాబా భాస్కర్ హౌన్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. గ్రాండ్ ఫినాలేలో ఉన్న టాప్-5 సభ్యుల్లో మొదట అలి రెజా, ఆ తర్వాత వరుణ్ సందేశ్ ఎలిమినేట్ అయ్యారు. ఇక మిగిలిన ముగ్గురిలో ఒకరిని బయటకు తీసుకెళ్లేందుకు హీరోయిన్ అంజలి ఇంట్లోకి వెళ్లారు. ఎలిమినేషన్‌కు ముందు ముగ్గురు సభ్యులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది అంజలి. రూ. 10 లక్షలను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోవాలని ఆఫర్ చేసింది. ఐతే ఆ డబ్బును శ్రీముఖి, రాహుల్, బాబా ముగ్గురూ తిరస్కరించారు. చివరకు రూ. 25 లక్షలు ఇస్తామని మరో డీల్ తీసుకొచ్చారు. దాన్ని కూడా ముగ్గురు ఇంటి సభ్యులు తిరస్కరించారు. ఈ క్రమంలో ఎలిమినేట్ కాబోయే సభ్యుడి పేరును కవర్లో నుంచి తీసి చదివింది అంజలి. అందులో బాబా భాస్కర్ పేరు ఉండడంతో ఆయన హౌస్ నుంచి వెళ్లిపోయారు.
Published by:Shiva Kumar Addula
First published:November 03, 2019, 21:17 IST