Bigg Boss 3: బిగ్‌ బాస్ షాక్.. అమ్మ కోసం వెక్కివెక్కి ఏడ్చిన శ్రీముఖి

Bigg Boss 3: ఇంట్లోకి వచ్చిన శ్రీముఖి తల్లి.. పాపా అంటూ శ్రీముఖిని పిలుస్తుంది. ఆ పిలుపు విన్న వెంటనే పరుగులు పెడుతుంది శ్రీముఖి. ఐతే అంతలోనే పవర్ సేవ్ మోడ్‌లోకి వెళ్లాలని బిగ్‌ బాస్ ఆదేశించడంతో శ్రీముఖి డోర్ దగ్గరే నిలిచిపోతుంది.

news18-telugu
Updated: October 17, 2019, 6:28 PM IST
Bigg Boss 3: బిగ్‌ బాస్ షాక్.. అమ్మ కోసం వెక్కివెక్కి ఏడ్చిన శ్రీముఖి
శ్రీముఖి (Image:Star MAA)
  • Share this:
బిగ్ బాస్ తెలుగు 3 రియాల్టి షో 13వ వారం కొనసాగుతోంది. దాదాపు 3 నెలలుగా ఇంటికి, కుటుంబానికి దూరంగా ఉంటున్న కంటెస్టెంట్లకు బిగ్‌ బాస్ కాస్త రిలీఫ్ ఇస్తున్నాడు. హౌస్‌లోకి కంటెస్టెంట్ల బంధువులను పంపిస్తూ కుటుంబంతో కలిసే అవకాశాన్ని కల్పిస్తున్నాడు. మొదట వితిక చెల్లి ఇంట్లోకి అడుగుపెట్టగా.. ఆ తర్వాత అలీ రెజా భార్య, శివజ్యోతి భర్త, బాబా భాస్కర్ భార్యా పిల్లలు హౌస్‌లోకి ఒక్కొక్కరుగా వెళ్లారు. తమ వారితో కాసేపు ముచ్చటించి గేమ్‌పై సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఎపిసోడ్‌లో వరుణ్ బామ్మ, శ్రీముఖి తల్లి ఇంట్లోకి వస్తారు.

దానికి సంబంధించి స్టార్ మా ఇప్పటికే ప్రోమో విడుదల చేసింది. ఐతే శ్రీముఖికి బిగ్‌ బాస్ బిగ్ షాక్ ఇచ్చినట్లు అందులో కనబడుతోంది. శ్రీముఖికి తన తల్లి లతను కలిసే అవకాశం ఇవ్వనట్లు తెలుస్తోంది. ఇంట్లోకి వచ్చిన శ్రీముఖి తల్లి.. పాపా అంటూ శ్రీముఖిని పిలుస్తుంది. ఆ పిలుపు విన్న వెంటనే పరుగులు పెడుతుంది శ్రీముఖి. ఐతే అంతలోనే ఆమె సంతోషం ఆవిరైంది. పవర్ సేవ్ మోడ్‌లోకి వెళ్లాలని బిగ్‌బాస్ ఆదేశించడంతో శ్రీముఖి డోర్ దగ్గరే నిలిచిపోతుంది. ఇక వచ్చిన దారిగుండా వెళ్లిపోవాలని లతకు సూచిస్తాడు. బిగ్‌ బాస్ ఆదేశం మేరకు లత ఇంటి నుంచి వెళ్లిపోతున్న తరుణంలో శ్రీముఖి వెక్కి వెక్కి ఏడ్చింది. అమ్మా..వెళ్లొద్దంటూ కన్నీళ్లు పెట్టుకుంది. మరి ఆమె నిజంగానే శ్రీముఖిని కలవకుండా వెళ్లిపోయిందా? లేదా? అన్నది తెలియాలంటే గురువారం ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.
Published by: Shiva Kumar Addula
First published: October 17, 2019, 6:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading