హెబ్బా పటేల్‌తో కౌశల్.. ఆసక్తికరమైన ప్రకటన చేసిన బిగ్ బాస్ విన్నర్..

కొన్నిసార్లు కొందరికి రావాల్సిన దానికంటే ఎక్కువ గుర్తింపు వస్తుంటుంది. అది ఆ సమయం వరకు మాత్రమే ఉండి.. ఆ తర్వాత కనిపించమన్నా కూడా కనిపించదు. కౌశల్ విషయంలో కూడా ఇదే జరిగింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 16, 2019, 3:24 PM IST
హెబ్బా పటేల్‌తో కౌశల్.. ఆసక్తికరమైన ప్రకటన చేసిన బిగ్ బాస్ విన్నర్..
కౌశల్ మందా ఇన్‌స్టాగ్రామ్ ఫోటో (Source: Instagram/ Kaushal Manda)
  • Share this:
కొన్నిసార్లు కొందరికి రావాల్సిన దానికంటే ఎక్కువ గుర్తింపు వస్తుంటుంది. అది ఆ సమయం వరకు మాత్రమే ఉండి.. ఆ తర్వాత కనిపించమన్నా కూడా కనిపించదు. కౌశల్ విషయంలో కూడా ఇదే జరిగింది. బిగ్ బాస్ 2 జరుగుతున్నపుడు ఈయన కోసం అభిమాన సంఘాలు కూడా వచ్చాయి. అసలు కౌశల్ కోసం ఆర్మీ తయారు కావడం ఏంటి.. పిచ్చి కాకపోతేనూ అంటూ అంతా ఆశ్చర్యపోయారు. కానీ నిజంగానే ఆయన కోసం అన్నాదానాలు, పాదయాత్రలు ఇలా అన్నీ చేసారు అభిమానులు. తీరా బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కనీసం పట్టించుకోవడం మానేసారు.
Bigg Boss 2 Winner Kaushal Manda is going to direct Hebah Patel for Shriram Gold Loan Ad film pk కొన్నిసార్లు కొందరికి రావాల్సిన దానికంటే ఎక్కువ గుర్తింపు వస్తుంటుంది. అది ఆ సమయం వరకు మాత్రమే ఉండి.. ఆ తర్వాత కనిపించమన్నా కూడా కనిపించదు. కౌశల్ విషయంలో కూడా ఇదే జరిగింది. kaushal,kaushal hebah patel,kaushal manda hebah patel,kaushal manda hebah patel shriram gold loan ad,kaushal ad film,kaushal army foundation,kaushal manda tanish war,kaushal army tanish,bigg boss 2 winner kaushal,kaushal press meet,kaushal army,tanish trying to spoil kaushal career,kaushal manda,bigg boss 2 kaushal army,kaushal manda twitter,kaushal manda instagram,kaushal army tweets,kaushal army press meet,kaushal tanish,telugu cinema,కౌశల్ మందా,కౌశల్ హెబ్బా పటేల్,కౌశల్ ఆర్మీ,కౌశల్ తనీష్ వార్,కౌశల్ ఆర్మీపై విమర్శలు,కౌశల్ ఆర్మీ ట్విట్టర్,కౌశల్ తనీష్,బిగ్ బాస్ 2 కౌశల్ ఆర్మీ,తెలుగు సినిమా
కౌశల్ మందా ఇన్‌స్టాగ్రామ్ ఫోటో (Source: Instagram/ Kaushal Manda)

కౌశల్ ఎక్కడున్నాడు.. ఏం చేస్తున్నాడనే విషయంపై ఇప్పుడు ఆరా తీయడం కూడా మానేసారు. ఆ టైమ్ వరకే కౌశల్ ఆర్మీ పని చేసింది. కానీ బిగ్ బాస్ తర్వాత కచ్చితంగా కౌశల్ వరస సినిమాలు చేస్తాడని అంతా ఊహించారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ కనీసం ఒక్క సినిమా కూడా చేయలేదు. ఈ ఏడాది కాలంగా ఎక్కువగా మీడియా ముందుకు కూడా రాలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈయన తన ఫ్యూచర్ గురించి కీలకమైన ప్రకటన చేసాడు. సినిమాలు ఎందుకు చేయడం లేదన్న వాళ్లకు సమాధానంగా తన భార్య ఆరోగ్యం బాగోలేదని.. ఆమె తర్వాతే సినిమాలు అంటూ రిప్లై ఇచ్చాడు.


ఇక ఇప్పుడు మరో స్టేట్మెంట్ ఇచ్చాడు కౌశల్. తాజాగా ఈయన ‘కుమారి 21F' ఫేం హెబ్బా పటేల్‌ను డైరెక్ట్ చేయబోతున్నట్లు చెప్పాడు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఇద్దరూ దిగిన ఫోటోను కూడా షేర్ చేశాడు కౌశల్. దానికి ట్యాగ్ లైన్ కూడా పెట్టాడు కౌశల్. ‘టైటిల్స్ వస్తుంటాయి.. పోతుంటాయి.. నా మల్టీటాస్కింగ్ మాత్రం అలాగే ఉంటుంది.. శ్రీరామ్ గోల్డ్ లోన్ యాడ్ ఫిల్మ్ కోసం హెబ్బా పటేల్‌ను డైరెక్ట్ చేస్తున్నానంటూ పోస్ట్ చేసాడు ఈయన. హైదరాబాద్‌తో పాటు మిగిలిన నగరాల్లో కూడా ఈయనకు యాడ్ కంపెనీతో పాటు మరిన్ని వ్యాపారాలు కూడా ఉన్నాయి.

First published: August 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు