కౌశ‌ల్ ఆర్మీ కాంట్ర‌వ‌ర్సీ ఏంటి.. త‌నీష్‌తో ఇప్ప‌టికీ కౌశ‌ల్ వార్ తెగ‌లేదా..?

కౌశ‌ల్ ఆర్మీ గురించి కొత్త‌గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. బిగ్ బాస్ 2 వ‌స్తున్న స‌మ‌యంలో ఎప్పుడూ చూసినా కూడా ట్రెండింగ్ లో ఉంది ఈ కౌశ‌ల్ ఆర్మీ. అస‌లు ఆయ‌న్ని గెలిపించిందే వాళ్ళు. అయితే ఇప్పుడు ఇలాంటి ఆర్మీపై నోరు పారేసుకుంటున్నాడు కౌశ‌ల్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 28, 2019, 9:06 AM IST
కౌశ‌ల్ ఆర్మీ కాంట్ర‌వ‌ర్సీ ఏంటి.. త‌నీష్‌తో ఇప్ప‌టికీ కౌశ‌ల్ వార్ తెగ‌లేదా..?
కౌశల్
  • Share this:
కౌశ‌ల్ ఆర్మీ గురించి కొత్త‌గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. బిగ్ బాస్ 2 వ‌స్తున్న స‌మ‌యంలో ఎప్పుడూ చూసినా కూడా ట్రెండింగ్ లో ఉంది ఈ కౌశ‌ల్ ఆర్మీ. అస‌లు ఆయ‌న్ని గెలిపించిందే వాళ్ళు. అయితే ఇప్పుడు ఇలాంటి ఆర్మీపై నోరు పారేసుకుంటున్నాడు కౌశ‌ల్. ఆయ‌నపై వాళ్లు కూడా ఇష్ట‌మొచ్చిన‌ట్లు కామెంట్ చేస్తున్నారు. కౌశ‌ల్ అస‌లు మ‌ర్యాద‌స్తుడే కాడ‌ని.. ఆయ‌న‌కు డ‌బ్బు త‌ప్ప మ‌రోటి ముఖ్య‌మే కాద‌ని వాళ్లు సెన్సేష‌న‌ల్ క‌మెంట్స్ చేస్తున్నారు. అన్నింటికి మించి కౌశ‌ల్ గెలిచిన డ‌బ్బు ఛారిటీకి ఇస్తాన‌ని చెప్పి మోసం చేసాడ‌ని చెబుతున్నారు వాళ్లు.

Bigg Boss 2 Winner Kaushal fires on his Army members and Arrange Press meet with Media pk.. కౌశ‌ల్ ఆర్మీ గురించి కొత్త‌గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. బిగ్ బాస్ 2 వ‌స్తున్న స‌మ‌యంలో ఎప్పుడూ చూసినా కూడా ట్రెండింగ్ లో ఉంది ఈ కౌశ‌ల్ ఆర్మీ. అస‌లు ఆయ‌న్ని గెలిపించిందే వాళ్ళు. అయితే ఇప్పుడు ఇలాంటి ఆర్మీపై నోరు పారేసుకుంటున్నాడు కౌశ‌ల్. kaushal army foundation,kaushal army,kaushal manda,bigg boss 2 kaushal army,kaushal manda twitter,kaushal manda instagram,kaushal army tweets,kaushal army press meet,kaushal tanish,telugu cinema,కౌశల్ ఆర్మీ,కౌశల్ ఆర్మీపై విమర్శలు,కౌశల్ ఆర్మీ ట్విట్టర్,కౌశల్ తనీష్,బిగ్ బాస్ 2 కౌశల్ ఆర్మీ,తెలుగు సినిమా
కౌశల్ ఆర్మీ


దాంతో చూసి చూసి ఆయ‌న కూడా స్పందించాడు. చెత్త వెధ‌వ‌ల‌కు స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం త‌న‌కు లేదంటూ కౌశ‌ల్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డాడు. దానికి తోడు త‌నీష్ ఉన్న ఫోటోను ట్వీట్ చేసి వెధ‌వ‌లు అన‌డంతో ఇప్పుడు లేనిపోని అనుమానాలకు తావిస్తున్న‌ట్ల‌యింది. బిగ్ బాస్ హౌజ్ అంటే ఓకే కానీ ఇప్పుడు బ‌య‌టికి వ‌చ్చిన త‌ర్వాత కౌశ‌ల్ ఇంకా వాళ్ల‌తో అలాగే శ‌త్రుత్వం కంటిన్యూ చేస్తున్నాడ‌ని ఇప్పుడు ఈ సీన్ చూస్తుంటే అర్థ‌మవుతుంది.


దానికి తోడు ఇన్నాళ్లూ నెత్తిన పెట్టుకుని పూజించిన వాళ్లే ఇప్పుడు నేల‌కేసి కొట్ట‌డంతో త‌ట్టుకోలేక‌పోతున్నాడు కౌశ‌ల్. మీ ఇష్ట‌మొచ్చింది చేసుకోండంటూ ర‌ఫ్ స‌మాధానాలు చెప్తున్నాడు కౌశ‌ల్. దాంతో కౌశ‌ల్ ఆర్మీతో పాటు మిగిలిన వాళ్లు కూడా ఇప్పుడు కౌశ‌ల్ తీరుపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మ‌రి ఈ వివాదం ఎక్క‌డ ముగుస్తుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. దానికితోడు ఇదే విష‌యంపై కౌశ‌ల్ ఫిబ్ర‌వ‌రి 28న ఉద‌యం శ్రీ‌న‌గ‌ర్ కాల‌నీలోని స‌త్య‌సాయి నిగ‌మాగ‌మంలో ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసాడు.
First published: February 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు