బీజేపీ తీర్థం పుచ్చుకున్న బిగ్‌బాస్ విజేత..

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 2 విన్నర్‌ కౌశల్, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు.

news18-telugu
Updated: November 29, 2019, 11:22 AM IST
బీజేపీ తీర్థం పుచ్చుకున్న బిగ్‌బాస్ విజేత..
బీజేపీలో చేరిన బిగ్ బాస్ తెలుగు విన్నర్ కౌశల్
  • Share this:
2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ దూకుడు పెంచింది. ఇప్పటికే తెలుగు దేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా పార్టీలో విలీనం చేసుకున్న భారతీయ జనతా పార్టీ.. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటుంది. ఇప్పటికే ఏపీలో తెలుగు దేశం పార్టీతో పాటు మిగతా పార్టీలో కీలకంగా ఉన్న నేతలను పార్టీలో చేర్చుకున్నారు.  తాజాగా బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 2 విన్నర్‌ కౌశల్‌ బీజేపీలో జాయిన్ అయ్యారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డ బీజేపీ కండువా కప్పి కౌశల్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. కౌశల్‌తో పాటు జేపీ నడ్డా సమక్షంలో తెలుగు దేశం మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: November 29, 2019, 11:21 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading