Chinthakindhi.RamuChinthakindhi.Ramu
|
news18-telugu
Updated: May 20, 2019, 11:45 AM IST
లగడపాటి రాజగోపాల్
ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్ ఎన్నికల సర్వే వచ్చేసింది. తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో టీడీపీ గెలుస్తుందని ఒక రోజు ముందుగానే సంకేతాలు ఇచ్చిన లగడపాటి రాజగోపాల్... ఎగ్జిట్ పోల్స్ సర్వేలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై అంచనాలు వెల్లడించారు. 175 అసెంబ్లీ స్థానాలున్న ఏపీలో టీడీపీకి 90-110, వైసీపీకి 65-77 సీట్లు, ఇతరులకు 1-3 సీట్లు వచ్చే అవకాశ ఉందని లగడపాటి రాజగోపాల్ తెలిపిన సంగతి తెలిసిందే. ఈ లెక్కన నారా చంద్రబాబునాయుడు సారథ్యంలోని టీడీపీ మరోసారి స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి రానున్నట్టు లగడపాటి సర్వే అంచనా వేసింది. ఇక లోక్ సభ స్థానాల విషయంలోనూ టీడీపీకే మొగ్గు ఉందని లగడపాటి సర్వే వెల్లడించింది. రాష్ట్రంలోని మొత్తం 25 పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ 13-17, వైసీపీ 8-12, ఇతరులు 0-1 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని ఆర్జీ ఫ్లాష్ టీమ్ సర్వే అంచనా వేసింది. అయితే ఎగ్జిట్ పోల్స్ సర్వే విషయాల సంగతి అటుంచితే... లగడపాటి రాజగోపాల్ సర్వే ప్రెస్ మీట్లో తెలుగు ప్రేక్షకులను బాగా పాయింట్ అవుట్ చేసిన మరో విషయం లగడపాటి పక్కనే కూర్చున్న ‘బిగ్‌బాస్’ పార్టిసిపెంట్ నూతన్ నాయుడు. అసలు నూతన్ నాయుడుకీ, లగడపాటి రాజగోపాల్‌కు సంబంధం ఏంటి? రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూసే ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు చెప్పేటప్పుడు లగడపాటి పక్కన ఆయన ఎందుకున్నాడనే అనుమానం చాలామంది తెలుగు వారిలో రేగుతోంది.

‘బిగ్‌బాస్ 2’ తర్వాత సంక్రాంతికి విడుదలైన ‘ఎఫ్2’ మూవీలో చిన్న పాత్రలో కనిపించాడు నూతన్ నాయుడు...
‘బిగ్‌బాస్’ తెలుగు సీజన్ 2లో ‘కామన్ మ్యాన్’ కోటాలో బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంటరైన ఈ ‘రిచెస్ట్ బిజినెస్ మ్యాన్’ నూతన్ నాయుడు. అయితే నూతన్ నాయుడు ప్రవర్తన వాస్తవికంగా లేకపోవడం, నటిస్తున్నట్టుగా తెలిసిపోవడంతో ‘బిగ్‌బాస్’ హౌస్‌లో కొన్ని వారాలు మాత్రమే లోపల ఉండగలిగాడు. ఎలిమినేషన్ తర్వాత కౌశల్ ఆర్మీ సపోర్ట్‌తో రీ-ఎంట్రీ కూడా ఇచ్చినా అది మూడు వారాల ముచ్ఛటగానే మిగిలింది. రెండోసారి ఎలిమినేట్ అయిన తర్వాత తనను అన్యాయంగా ఎలిమినేట్ చేశారని వాదించాడు. తనకు సరిపడినన్ని ఓట్లు వచ్చినా కావాలనే బయటికి పంపించారని అలిగి... ఫైనల్‌కి హాజరు కాలేదు. ‘నూతన్ నేవీ’ పేరుతో కొంత మంది ఫ్యాన్స్ హడావిడి కూడా చేశారు. అయితే అదంతా నూతన్ చేయించిందే అని అనుమానించేవారు లేకపోలేదు. బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు నూతన్ నాయుడు ‘మా’టీవీకి భారీగా నగదు ముట్టజెప్పాడని, రీ-ఎంట్రీకి కూడా అదే కారణమని కూడా వార్తలు వినిపించాయి.

నూతన్ నాయుడు, కౌశల్ మందా (Photos: Facebook)
ఇప్పుడు లగడపాటి పక్కనే దర్జాగా కూర్చుని కనిపించాడు నూతన్ నాయుడు. దాంతో లగడపాటి సాన్నిహిత్యం పెంచుకున్న నూతన్ నాయుడు, ప్రత్యేక్ష రాజకీయాల్లోని ఘనంగా ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నాడేమోనని కొందరు భావిస్తుంటే... మరికొందరు నూతన్ నాయుడు, లగడపాటి రాజగోపాల్ బినామీయేమోనని అనుమానిస్తున్నారు. మరికొందరేమో లగడపాటి ప్రెస్ మీట్ పెట్టిన ఫోర్చూన్ గ్రాండ్ హోటల్ నూతన నాయుడిదేనని, అందుకే పక్కనే కూర్చీ వేసుకుని దర్జాగా కూర్చున్నాడని అంటున్నారు. అయితే గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ నూతన్ నాయుడు... కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచనల్లో ఉన్నట్టు సమాచారం. ఈసారి కాకపోయినా వచ్చే ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని, అప్పుడు తనకు టికెట్ పక్కా అవుతుందనే ఉద్దేశంతో లగడపాటి అండ్ కోతో సన్నిహితంగా మెలుగుతున్నట్టు సమాచారం. మరి ఈ ‘బిగ్‌బాస్’ పార్టిసిపెంట్ బిగ్ ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.
First published:
May 20, 2019, 11:41 AM IST