Bigg Boss 14 Winner Rubina Dilaik | ఎక్కడో విదేశాల్లో పాపులర్ అయిన బిగ్‌బాస్ షో.. హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా మంచి సక్సెస్ సాధించింది. అదే ఊపుతో తెలుగులో నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. త్వరలో ఐదో సీజన్‌కు రంగం సిద్ధమవుతోంది. కానీ హిందీలో మాత్రం ఇప్పటి వరకు బిగ్‌బాస్ రియాలిటీ షో 14 సీజన్లు నిన్నటి (ఆది వారం)తో కంప్లీట్ చేసుకుంది. ఈ సారి బిగ్‌బాస్ 14 విజేతగా రుబీనా దిలేక్ (Rubina Dilaik) నిలిచింది. మరోవైపు బిగ్‌బాస్ 14 రన్నరప్‌గా రాహుల్ వైద్య (Rahul Vaidya) నిలిచారు. చివరి వరకు ఎంతో ఉత్కంఠగా సాగిన బిగ్‌బాస్ 14 ఫైనల్ ఎపిసోడ్లో ఎక్కువ ఓట్లతో రుబినా బిగ్‌బాస్ 14 విజేతగా నిలిచింది. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి రుబినాకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ వచ్చింది. అంతేకాదు హౌస్‌లో రుబినా ఉన్న బయట ఫ్యాన్స్ మాత్రం ఆమె పేరును సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో ట్రెండ్ అయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
బిగ్‌బాస్ 14 గ్రాండ్ ఫినాలేలో ఐదుగురు ఫైనలిస్ట్‌లో రాఖీ సావంత్, రుబినా దిలేఖ్, రాహుల్ వైద్య, నిక్కి తంబోలి, ఎలి గోని పోటీ పడ్డారు. ఇంత పోటీలో కూడా ఎక్కువ ఓట్లతో రుబినా బిగ్‌బాస్ 14 విజేతగా నిలిచింది. ఈ గ్రాండ్ ఫినాలేలో ముందుగా రాఖీ సావంత్.. రూ. 14 లక్షలు తీసుకొని షో నుంచి నిష్క్రమించింది. ఆ తర్వాత ఎలీ గోనీ, నిక్కి తంబోలి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. చివరకు రాహుల్ వైద్య మాత్రం రన్నరప్‌గా నిలిచారు.
Congratulations to @RubiDilaik! ✨??
Audience ka dil jeet kar aakhirkaar karli hai inhone #BiggBoss14 ki trophy haasil! How happy are you #Rubiholics?@BeingSalmanKhan #BB14 #BB14GrandFinale #BiggBoss14Finale #GrandFinaleBB14 pic.twitter.com/IRO5vXordi
— Bigg Boss (@BiggBoss) February 21, 2021
బిగ్‌బాస్ 14 గ్రాండ్ ఫినాలేలో రుబినా దిలేక్.. తన భర్త అభినవ్ శుక్లాతో హౌస్‌లో అడుగు పెట్టింది. గ్రాండ్ ఫినాలేకు కొన్ని ఎపిసోడ్స్ ముందే రుబినా దిలేక్ భర్త అభినవ్ శుక్లా హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు. హౌస్‌లో భర్త లేకున్న తనకున్న తెలివి తేటలతో ప్రేక్షకుల మనషులు గెలవడంతో సక్సెస్ అయింది రుబినా దిలేక్. బిగ్‌బాస్ 14 విజేతగా నిలిచిన రుబినా దిలేక్కు సల్మాన్ ఖాన్ రూ. 36 లక్షల ప్రైజ్ మనీ అందజేసాడు. ఇక బిగ్‌బాస్ హిందీ టైటిల్ గెలుచుకున్న ఆరో మహిళగా నిలిచింది. ఇక టీవీ నటిగా ఐదో మహిళ. ఈమె కంటే ముందు శ్వేతా తివారి, ఊర్వశి డిలాకియా, జుహీ పర్మర్, గౌహార్ ఖాన్, శిల్పా షిండే మరియు దిపీకా కకర్ బిగ్‌బాస్ విజేతలుగా ట్రోఫీని కైవసం చేసుకున్నారు.
View this post on Instagram
బిగ్‌బాస్ 14 గ్రాండ్ ఫినాలే చివరి వరకు ఎంతో అట్టహాసంగా సాగింది. కంటెస్టెంట్స్ తమ పర్ఫామెన్స్తో ప్రేక్షకులను అలరించారు. చివరగా సల్మాన్ ఖాన్ తన డాన్సులతో ఈ ఫినాలే ఎపిసోడ్‌ను ఎక్కడికో తీసుకెళ్లారు. ఈ బిగ్‌బాస్ 14 గ్రాండ్ ఫినాలేలో ఒకప్పటి బాలీవుడ్ హీ మాన్‌గా గుర్తింపు పొందిన ధర్మేంద్ర ఎంట్రీతో ఇంకాస్త అదిరిపోయింది. ధర్మేంద్ర తో కలిసి సల్మాన్ చేసి హంగామా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అంతేకాదు ఈ షోలో ‘షోలే’ మూవీలోని ఓ సీన్‌ను రీ క్రియేట్ చేసారు. అందులో భాగంగా సల్మాన్ ఖాన్.. గబ్బర్ సింగ్‌గా అలరిస్తే.. రాఖీ సావంత్.. బసంతి పాత్రలో నటించింది. మొత్తంగా హిందీలో ప్రసారమయ్యే ఈ బిగ్‌బాస్ ఫినాలే ప్రేక్షకులను బాగానే అలరించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bigg boss 14, Bollywood news, Salman khan