Bigg Boss:‌ బిగ్‌బాస్‌లో కొత్త ప్రయోగం.. ఎన్నడు లేనట్టుగా హౌస్‌లోకి కుక్కలు..

Bigg Boss | కరోనా కారణంగా బిగ్‌బాస్‌తో పాటు అన్నింట్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే తెలుగులో బిగ్‌బాస్ సీజర్ 4 స్టార్ట్ అయింది. తాజాగా బిగ్‌బాస్ షోలో కుక్కలు స్పెషల్ ఎంట్రీ ఇవ్వనున్నాయి.

news18-telugu
Updated: October 3, 2020, 8:06 PM IST
Bigg Boss:‌ బిగ్‌బాస్‌లో కొత్త ప్రయోగం..  ఎన్నడు లేనట్టుగా హౌస్‌లోకి కుక్కలు..
బిగ్ బాస్ లోగో (Bigg Boss)
  • Share this:
Bigg Boss | కరోనా కారణంగా బిగ్‌బాస్‌తో పాటు అన్నింట్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే తెలుగులో బిగ్‌బాస్ సీజర్ 4 స్టార్ట్ అయింది. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్‌కు ముందుగానే కరోనా పరీక్షలు చేయడంతో పాటు 14 రోజుల క్వారంటైన్ తర్వాత కానీ హౌస్‌లోకి పంపలేదు. ఆ సంగతి పక్కనపెడితే.. కరోనా తర్వాత హిందీలో ఈ సారి బిగ్‌బాస్ 14 షోను కాస్త ఆలస్యంగా ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే షోలో కొన్ని కీలక మార్పులు చేపట్టారు. అంతేకాదు ఇందులో నియమ నిబంధనలు కూడా పూర్తిగా మార్చినట్టు సమాచారం. బిగ్‌బాస్ హౌస్‌ అలంకరణతో పాటు లైటింగ్ థీమ్ విషయంలో ప్రతీది కొత్తగా ఉండేటట్టు ప్లాన్ చేసారు. ఈసారి బిగ్‌బాస్ 14 హౌస్‌కు కాపలాగా కుక్కలను పెడుతున్నారు. కుక్కలను అంటే నిజమైన కుక్కులు కాదు. వాటి ఆకారం పోలిన మెటాలిక్ బొమ్మలను ఉంచారు. అంతేకాదు హౌస్‌లో గార్డెనింగ్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

బిగ్‌బాస్ హౌస్‌లో కుక్కల బొమ్మలు (Twitter/Photo)


ఇక బిగ్‌బాస్ 14 హౌస్‌ను ఆర్ట్ డైరెక్టర్ ఓమంగ్ కుమార్ సరికొత్తగా తీర్చిదిద్దాడు. ఎక్కువగా బ్రైట్ కలర్స్‌ను ఉపయోగించారు. అంతేకాదు హౌస్‌లో ఉన్న అన్ని తలుపులపై కుక్క బొమ్మల డిజైన్ 3D ఎఫెక్ట్‌లో వేసినట్టు సమాచారం. దూరం నుంచి చూస్తే.. హౌస్‌లో నిజమైన కుక్కలు ఉన్నట్టు భ్రమ కల్పించేలా డిజైన్ చేసారట. మొత్తంగా బిగ్‌బాస్ హౌస్‌ను ఎన్నడు లేనంతగా సరికొత్తగా తీర్చిదిద్దారు.బిగ్‌బాస్ షో విషయానికొస్తే..  ఎక్కడో విదేశాల్లో పాపులర్ అయిన బిగ్‌బాస్ షో.. హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా మంచి సక్సెస్ సాధించింది.

Bollywood star hero salman khan to charge rupees 16 crore per episode for bigg boss 14 season,salman khan,salman khan bigg boss 14,salman khan remunaration for bigg boss 14,16 crore remunaration fro bigg boss 14,salman khan twitter,salman khan instagram,bigg boss, hindi bigg boss, bigg boss season 12, salman khan, salman khan bigg boss, బిగ్‌బాస్, సల్మాన్ ఖాన్ బిగ్ బాస్,సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్,సల్మాన్ ఖాన్ బిగ్‌బాస్ 14,సల్మాన్ ఖాన్ 16 కోట్ల పారితోషకం,సల్మాన్ ఖాన్ బిగ్‌బాస్ సీజన్ 14కు అత్యధిక పారితోషకం
సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ 14 కోసం అత్యధిక పారితోషకం (Twitter/Photo)


అదే ఊపుతో తెలుగులో మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. నాల్గో సీజన్‌ రన్ అవుతోంది. కానీ హిందీలో మాత్రం ఇప్పటి వరకు బిగ్‌బాస్ రియాలిటీ షో 13 సీజన్లు పూర్తి చేసుకుంది. 14 వ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది.  ప్రతి సీజన్‌లో సల్మాన్ ఖాన్ తన రెమ్యుననరేషన్ పెంచుకుంటూ పోతున్నాడు.ఈ 14వ సీజన్‌కు సల్మాన్ ఖాన్ మరోసారి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు.  బిగ్‌బాస్ షో సీజన్ 14లో ఒక్కో ఎసిపోడ్‌కు సల్మాన్ ఖాన్.. రూ. 16 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ (salman khan bigg boss)
సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ (salman khan bigg boss)


అంటే సల్మాన్ ఖాన్.. ప్రతి వారం వీకెండ్ శని, ఆదివారాలు ఎపిసోడ్‌లో అభిమానులను పలకరిస్తూ ఉంటాడు.  ఈ లెక్కన 100 రోజల్లో 14 వారాలు అంటే 28 నుంచి 30 రోజలు సల్మాన్ ఖాన్.. బిగ్‌బాస్ ఎసిపోడ్‌లో కనిపిస్తాడు. ఈ లెక్కన మొత్తం బిగ్‌బాస్ 14 సీజన్ కోసం సల్మాన్ ఖాన్.. రూ. 450  కోట్ల నుంచి రూ. 500 కోట్ల వరకు  పారితోషకం అందుకునే అవకాశాలున్నాయి. మొత్తంగా ఒక సినిమాలో సల్మాన్ ఖాన్ యాక్ట్ చేస్తే.. రూ. 50 కోట్ల వరకు పారితోషకం అందుకుంటున్నాడు.  అదే బిగ్‌బాస్ వంటి రియాలిటీ షో ద్వారా అంతకు 9 నుంచి 10 రెట్లు రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. మొత్తంగా సల్మాన్ ఖాన్.. తన క్రేజ్‌ను బాగానే క్యాష్ చేసుకుంటున్నాడనే చెప్పాలి. ప్రస్తుతం హీరోగా ‘రాధే’తో పాటు ‘కభీ ఈద్ కభీ దీవాళి’ సినిమాలు చేస్తున్నాడు.
Published by: Kiran Kumar Thanjavur
First published: October 3, 2020, 8:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading