Bigg Boss: బిగ్ బాస్ హౌజ్‌లో థియేటర్, మాల్, రెస్టారెంట్.. ఇకపై ఇంట్లోనే అన్నీ..

Bigg Boss: బిగ్ బాస్.. ఇప్పుడు ఈ పదం చాలా ట్రెండింగ్. ఎందుకంటే తెలుగులో సీజన్ మొదలైన మూడో వారమే నానా రచ్చ చేస్తున్నారు కంటెస్టెంట్స్. పైగా దేశంలోనే అత్యధిక రేటింగ్ తీసుకొచ్చింది అంటూ నాగార్జున కూడా హంగామా చేసాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 24, 2020, 10:26 PM IST
Bigg Boss: బిగ్ బాస్ హౌజ్‌లో థియేటర్, మాల్, రెస్టారెంట్.. ఇకపై ఇంట్లోనే అన్నీ..
బిగ్ బాస్ లోగో (Bigg Boss)
  • Share this:
బిగ్ బాస్.. ఇప్పుడు ఈ పదం చాలా ట్రెండింగ్. ఎందుకంటే తెలుగులో సీజన్ మొదలైన మూడో వారమే నానా రచ్చ చేస్తున్నారు కంటెస్టెంట్స్. పైగా దేశంలోనే అత్యధిక రేటింగ్ తీసుకొచ్చింది అంటూ నాగార్జున కూడా హంగామా చేసాడు. రికార్డు టీఆర్పీతో బిగ్ బాస్ దుమ్ము దులిపేస్తుందని నిర్వాహకులు కూడా ఆనందంలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్‌లోనే థియేటర్స్, మాల్స్, రెస్టారెంట్స్ కనిపించబోతున్నాయి. అదేంటి.. ఇప్పుడు మళ్లీ యాడ్ చేస్తున్నారా ఏంటి అనుకుంటున్నారా..?

సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ (salman khan bigg boss)
సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ (salman khan bigg boss)


ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ తెలుగు బిగ్ బాస్ కాదు.. హిందీ బిగ్ బాస్ కోసం. అక్కడ నిర్వాహకులు అలా ప్లాన్ చేస్తున్నారు. తెలుగు కంటే కూడా హిందీ బిగ్ బాస్ చాలా పాపులర్. ఇండియన్ టెలివిజన్ రికార్డులను ఇది బద్ధలు కొట్టింది. సల్మాన్ ఖాన్ హోస్టుగా ఉన్న ఈ షో ప్రతీసారి టిఆర్పీ తుప్పు వదలగొడుతుంది. ఇప్పటికే 13 సీజన్స్ పూర్తి చేసుకుంది బిగ్ బాస్. తాజాగా అక్టోబర్ 3 నుంచి బిగ్ బాస్ 14 మొదలు కానుంది. ఈ సారి మరిన్ని అంచనాలు ఉన్నాయి.

సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ (salman khan bigg boss)
సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ (salman khan bigg boss)


ఎందకుంటే కరోనా సమయం కావడంతో అక్కడ కూడా కంటెస్టెంట్స్ కోసం భారీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు నిర్వాహకులు. అందరికీ కరోనా టెస్టులు చేసిన తర్వాత కానీ వాళ్లను ఇంట్లోకి పంపించడం లేదు. ఇదిలా ఉంటే హిందీ బిగ్ బాస్ హౌజ్ ఈసారి మరింత సుందరంగా ముస్తాబైంది. అందులోనే థియేటర్‌తో పాటు మాల్, రెస్టారెంట్, స్పా కూడా ఏర్పాటు చేసారు. వీటికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రతీ ఫోటోలో కూడా సల్మాన్ ఖాన్ కనిపిస్తున్నాడు.


ఈ సారి హౌజ్‌లో కంటెస్టెంట్స్‌తో పాటు థియేటర్, మాల్, హోటల్ కూడా ఉండబోతుందని తెలిపాడు సల్మాన్ ఖాన్. అక్టోబర్ 3 నుంచి భారీగా బిగ్ బాస్ 14 మొదలు కానుంది. దీనికోసం భారీ హంగులు ఉండబోతున్నాయి. 14వ సీజన్ కోసం ఏకంగా 400 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడు కండల వీరుడు. దానికి తగ్గట్లే రేటింగ్స్ వస్తాయని నమ్ముతున్నారు నిర్వాహకులు. మరి చూడాలిక.. ఈ కొత్త సీజన్ ఎలా ఉండబోతుందో..?
Published by: Praveen Kumar Vadla
First published: September 24, 2020, 10:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading