BIGG BOSS 13 WINNER AND FAMOUR TV CELBRATY SIDHARTH SHUKLA PASSED AWAY DUE TO CARDIAC ARREST NR
Sidharth Shukla: బిగ్ బ్రేకింగ్.. బిగ్ బాస్ విన్నర్ సిద్ధార్ద్ శుక్లా హార్ట్ ఎటాక్‌తో మృతి!
sidharth shukla
Sidharth Shukla: ప్రముఖ నటుడు, హిందీ బిగ్ బాస్ సీజన్ 13 విజేత సిద్ధార్థ్ శుక్లా గుండెపోటుతో మరణించారు. గత సీజన్ బిగ్ బాస్ 13 విజేతగా నిలిచిన సిద్దార్ధ్ శుక్లా 40 ఏళ్ళకే గుండెపోటుతో కన్నుమూశారు.
Sidharth Shukla: ప్రముఖ నటుడు, హిందీ బిగ్ బాస్ సీజన్ 13 విజేత సిద్ధార్థ్ శుక్లా గుండెపోటుతో మరణించారు. గత సీజన్ బిగ్ బాస్ 13 (Bigg Boss 13) విజేతగా నిలిచిన సిద్దార్ధ్ శుక్లా 40 ఏళ్ళకే గుండెపోటుతో కన్నుమూశారు. బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన సిద్ధార్ధ్ ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన సిద్దార్థ్ తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
హిందీలో బాలిక వదు అలియాస్ చిన్నారి పెళ్లికూతురు (Chinnari Pellikuthuru) సీరియల్ లో హీరోగా సిద్దార్ధ్ శుక్లా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. గత సంవత్సరం 2019 - 2020 లో బిగ్ బాస్ 13 సీజన్ లోకి అడుగుపెట్టి విజేతగా నిలిచాడు. దీంతో సిద్దార్ధ్ శుక్లా కు (Sidharth Shukla) వరుస సినిమా అవకాశాలు, వెబ్ సిరీస్ అవకాశాలు వచ్చాయ్. అయితే ఇటీవలే సిద్ధార్ధ్ నటించిన బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్ 3 వెబ్ సిరీస్ విడుదలై ఆకట్టుకుంది. కిస్కి దుల్హనియా, బిజినెస్ ఇన్ రైతు బజార్ (Business in Raithu Bazar) సినిమాల్లో సిద్దార్ధ్ శుక్లా నటించారు.
ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 14 లో (Bigg Boss Season 14) అప్పుడప్పుడు ఎంట్రీ ఇస్తున్న సిద్దార్ధ్ శుక్లా సడన్ గా చనిపోవడంతో అభిమానులు షాక్ కి గురయ్యారు. ఎంతో ఆరోగ్యంగా, సిక్స్ ఫ్యాక్ బాడీతో కనిపించే సిద్దార్థ్ శుక్లా (Sidharth Shukla) మృతిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సిద్దార్థ్ శుక్లా మృతిపట్ల మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
కాగా సిద్దార్థ్ శుక్లాతో కలిసి చిన్నారి పెళ్లికూతురు (Chinnari Pellikuthuru) సీరియల్ లో నటించిన ప్రత్యుష బెనర్జీ (Pratyusha Banerjee) కూడా చిన్నవయసులోనే ఆత్మహత్య చేసుకొని మృతి చెందింది. కొన్ని నెలల క్రితమే చిన్నారి పెళ్లికూతురు సీరియల్ లో భామ పాత్రలో నటించిన జాతీయ అవార్డు గ్రహీత సురేఖా సిక్రి (Surekha Sikri) అనారోగ్యంతో కన్నుమూశారు. ఇక బుల్లితెరపై నటించి వెండితెరపై స్టార్ గా పేరు తెచ్చుకున్న సుశాంత్ సింగ్ రాజపుత్ (sushanth SIngh Rajputh) గత సంవత్సరం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.