• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BIGG BOSS 13 SALMAN KHAN LEAVES BIGG BOSS SHOW STAGE IN ANGER WITH CONTESTANTS BEHAVIOR SR

Bigg Boss : ఇంటి సభ్యులపై ఆగ్రహంతో... మధ్యలోనే వెళ్లిపోయిన హీరో..

Bigg Boss : ఇంటి సభ్యులపై ఆగ్రహంతో... మధ్యలోనే వెళ్లిపోయిన హీరో..

బిగ్‌ బాస్ లోగో (Twitter/Photo)

Bigg Boss : రియాలిటీ షో బిగ్ బాస్ దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ షో దాదాపు దేశంలోని అన్ని ప్రధాన భాషాల్లో ప్రసారం అవుతూ.. యావత్ దేశాన్ని అలరిస్తోంది.

  • Share this:
    Bigg Boss : రియాలిటీ షో బిగ్ బాస్ దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ షో దాదాపు దేశంలోని అన్ని ప్రధాన భాషల్లో ప్రసారం అవుతూ.. యావత్ దేశాన్ని అలరిస్తోంది. తెలుగులో ఈ షోను కింగ్ నాగార్జన హోస్ట్ చేస్తుంటే.. హిందీలో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యహరిస్తున్నాడు. హిందీలో ప్రస్తుతం 13 వ సీజన్ నడుస్తోంది. కాగా హోస్ట్  సల్మాన్‌ఖాన్‌కు ఇంటి సభ్యులపై కోపం వచ్చింది. అంతే, తాను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’ నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. దీనికి సంబందించిన ఓ ప్రోమోను కలర్స్‌ టీవీ విడుదల చేసింది.



    ఆ ప్రోమోలో సల్మాన్ ఈ సందర్భంగా ఇంటి సభ్యులను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ' ఏమైనా తమాషాగా ఉందా?  అంటూ పెద్దగా అరుస్తూ.. తాను బిగ్‌బాస్‌ నుంచి వెళ్లిపోతున్నట్లు చెప్పారు. దీంతో షాక్ తిన్న ఇంటి సభ్యులు.. అలా ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. తాజాగా విడుదల చేసిన ఈ ప్రొమోలో ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు బిగ్ బాస్ అభిమానులు.  అయితే ఇదంతా టీఆర్పీ రేటింగ్‌ కోసం చేసిన ఎత్తుగడ అని అంటున్నారు.. నెటిజన్స్.  ఇలా  సల్మాన్‌ ఖాన్.. బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి వెళ్లిపోతాననడం కొత్త విషయమే కాదని.. ఇంతక ముందు సీజన్‌లలో కూడా ఇలాంటి స్టంట్స్ చేశారని అంటున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు