Home /News /movies /

BIGG BOSS 11TH WEEK MANAS AS CAPTAIN IT SEEMS THAT THERE WILL BE TWO IN THE ELIMINATION VB

Bigg Boss Telugu 5: ఈ వారం కెప్టెన్ గా ‘మానస్’.. ఎలిమినేషన్ అయ్యేది ఎవరో తెలిసింది..

బిగ్ బాస్ తెలుగు 5

బిగ్ బాస్ తెలుగు 5

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం 9 మంది ఉన్నారు. 19 మందితో మొదలైన ఈ జర్నీ చివరకు 11 వారంలోకి అడుగు పెట్టింది. దీనిలో ఈ వారం బయటకు వెళ్లేందుకు 8 మంది నామినేట్ అయ్యారు. ఇదిలా ఉండగా.. 11 వ వారం కెప్టెన్ గా మానస్ ఎంపికైనట్లు సమాచారం. 11 వ వారం ఎలిమినేషన్ అయ్యేది ఆమె అనేది.. నెజిజన్ల టాక్.

ఇంకా చదవండి ...
    బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం 9 మంది ఉన్నారు. 19 మందితో మొదలైన ఈ జర్నీ చివరకు 11 వారంలోకి అడుగు పెట్టింది. దీనిలో ఈ వారం బయటకు వెళ్లేందుకు 8 మంది నామినేట్ అయ్యారు. అందులో వీక్ కంటెస్టెంట్ గా మాత్రం యానీ, ప్రియాంక, కాజల్ ఉన్నారు. వీళ్లకు బయటకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ సరిగ్గా లేకపోవడంతో ఓట్ల శాతం తగ్గుతుందనేది తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. 11 వ వారం కెప్టెన్స టాస్క్ అనేది రసవత్తరంగా సాగుతోంది. ఫస్ట్ కెప్టెన్సీ పోటీదారులుగా మానస్ అండ్ పింకీ బెలూన్ టాస్క్ ఆడిన సంగతి తెలిసిందే. అందులో ఎక్కువగా బెలూన్స్ పేల్చిన పింకీ ఫస్ట్ కెప్టెన్సీ కంటెండర్ గా నిలిచారు.ఆ తర్వాత మళ్లీ సన్నీ, సిరికి మధ్య కెప్టెన్ కంటెండర్ గా నిలవడం కోసం.. స్విమ్మింగ్ ఫూల్ టాస్క్ ను ఇచ్చారు బిగ్ బాస్. దీనిలో సిరి కి బదులు మానస్ దానికి పోటీలో దిగారు. దీనిలో సన్నీ ఓడిపోతాడు. మానస్ గెలుస్తాడు. మానస్ తరఫును సిరి రెండో కెప్టెన్సీ కంటెండర్ గా నిలుస్తుంది.

    Bigg Boss Telugu 5: శ్రీరామచంద్రపై కుట్ర పన్నారా.. అందుకే ఇలా చేస్తున్నారా..


    ఇక్కడే మూడో కంటెస్టెంట్ గా అనీమాస్టర్ గెలిచిన సింగతి తెలిసిందే. అనీమాస్టర్ కి వచ్చిన ఛాలెంజ్ లో గెలిచి మూడో కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారు. ఇక మరోవైపు నాలుగో పార్టిసిపెంట్ గా మానస్ ఎంపిక అవుతాడు. ఇక ఈ నలుగురు మధ్యలో జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో మానస్ విన్నర్ గా నిలిచాడట. ఇక మానస్ కెప్టెన్ అవ్వాలన్న కల నెరవేరినట్లు అయింది.

    BiggBoss Telugu 5: బిగ్ బాస్ కొత్త కెప్టెన్ గా ‘యానీ’..! ఎలిమినేషన్లో ఊహించని ట్విస్ట్..


    ఎప్పటి నుంచో అతడు ఈ అవకాశం కోసం ఎదురు చూశాడు. ఇక రేషన్ మేనేజర్ గా సిరిని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. హౌస్ మేట్స్ సహకారంతోనే మానస్ కెప్టెన్ అయినట్లుగా చెప్తున్నారు. ఇక టాస్క్ లో మరోసారి సన్నీకి మానస్ కి క్లాష్ అయ్యిందని.. ఇద్దరు ఫ్రెండ్స్ మద్యలో చిన్నపాటి ఘర్షణ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. నిన్న టీషర్ట్ లేబుల్ విషయంలో సన్నీ మరోసారి అగ్రెసివ్ అయిన విసయం తెలిసిందే.

    Bigg Boss 5 Telugu: భారీగా పడిపోయిన షణ్ముఖ్ గ్రాఫ్.. నంబర్ వన్ స్థానంలోకి వచ్చిన మరో కంటెస్టెంట్..


    దీనిలోనే మానస్ కు, సన్నీకి మధ్య కాస్త బేధాభిప్రాయాలు వచ్చినట్లు తెలిసింది. ఇక ఈ వారం నామినేషన్లో ట్టిస్ట్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. అలా అయితే ప్రియాంక, యానీ బయటకు వెళ్లొచ్చు. ఒక్కరే ఉంటే మాత్రం యనీ డేంజర్లో ఉన్నట్లు ఇప్పటి వరకు వచ్చిన ప్రైవేట్ ఓటింగ్ లో తెలుస్తోంది.
    Published by:Veera Babu
    First published:

    Tags: Bigg Boss, Bigg Boss 5 Telugu, Bigg boss 5 telugu buzz, Bigg boss telugu, Manas, Nagarjuna, Shanmukh, Sunny

    తదుపరి వార్తలు