Home /News /movies /

BIGBOSS CONTESTANT SOHAIL IN PROBLEM DUE TO MEHABOOB HERE ARE THE DETAILS MK

BiggBoss: మెహబూబ్ చేసిన పనికి చిక్కుల్లో సొహైల్...తప్పు సరిదిద్దేందుకు రంగంలోకి బిగ్‌బాస్ ఇంటర్నేషనల్ టీమ్..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

మెహబూబ్ కు సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి బయటకు వచ్చింది. మెహబూబ్ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి సొహైల్‌ని చూసి చాలా ఎమోషనల్ అయినట్లు చూపించాడు. అయితే మధ్యలో ఉన్న అద్దంపై మాత్రం డబ్బులు తీసుకొని బయటకు వచ్చేయ్ అంటూ సైగలు చేశాడనే ఆరోపణలు వస్తున్నాయి.

ఇంకా చదవండి ...
    బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్‌ లో ఎట్టకేలకు అభిజిత్ విన్నర్ గా నిలిచినప్పటికీ, సొహైల్ ఎపిసోడ్ మాత్రం బిగ్ బాస్ చరిత్రలోనే ఒక అరుదైన ఘట్టంగా మిగిలిపోనుంది. ఎందుకుంటే సొహైల్ అటు అఖిల్ ను, ఇటు అభిజిత్ ను షాక్ కు గురి చేస్తూ 25 లక్షల మనీతో బయటకు వచ్చేశాడు. అటు అఖిల్ ఏకంగా షాక్ తింటే, అభిజిత్ కూడా తనకు వచ్చే ప్రైజ్ మనీలో సగం సొహైల్ గద్దలా తన్నుకుపోయాడని బాధపడిన సంగతి తెలిసిపోయింది. ఇక సొహైల్ మాత్రం అటు 25 లక్షలు, అలాగే నాగార్జున ప్రామిస్ చేసిన 10 లక్షలు (అనాథశరణాలయం కోసం), అలాగే చిరంజీవి మెహబూబ్ కు స్వయంగా రూ.10 లక్షలు ఇవ్వడం విశేషం. అంటే బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ కు రూ.25 లక్షలు దక్కితే సొహైల్ కు మాత్రం ఏకంగా రూ.40 లక్షల దాకా బెనిఫిట్ దక్కింది. నిజానికి అఖిల్, సొహైల్ మధ్య బిగ్ బాస్ విన్నర్ ఎవరు అయినా చెరో పాతిక లక్షలు షేర్ చేసుకోవాలని ఒప్పందం కుదిరింది. అయితే సొహైల్ మాత్రం అఖిల్ ను మోసం చేశాడనే చెప్పాలి. ఎందుకంటే, అతడు రూ.25 లక్షల ఫిగర్ వినపడగానే అఖిల్ కు ఏమాత్రం చెప్పకుండానే మధ్యలో డ్రాప్ అయ్యాడు. అయితే సొహైల్ నిర్ణయం వెనుక అతడి స్నేహితుడు మెహబూబ్ బయట నుంచే చక్రం తిప్పడానే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

    దీనికి సాక్ష్యంగా మెహబూబ్ కు  సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి బయటకు వచ్చింది. మెహబూబ్ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి సొహైల్‌ని చూసి చాలా ఎమోషనల్ అయినట్లు చూపించాడు. అయితే మధ్యలో ఉన్న అద్దంపై మాత్రం డబ్బులు తీసుకొని బయటకు వచ్చేయ్ అంటూ సైగలు చేశాడనే ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు సొహైల్‌కి మూడు వేళ్ళను చూపిస్తూ అతడు నిలిచేది నెంబర్ 3 అని ముందే లీక్ చేసినట్టుగా ఈ వీడియోలో కనిపించింది. ఎలాగూ తనది మూడో స్థానం అని ముందే మెహబూబ్ ద్వారా సొహైల్‌కి ఇన్ సైడ్ ఇన్ఫర్మేషన్ లీక్ కావడంతో బిగ్ బాస్ రూ.25 లక్షల ఆఫర్ ప్రకటించగానే ఓకే చేశాడని నెటిజన్లు అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



    అయితే దీనిపై అఖిల్ , అభిజిత్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. ఇలా చేస్తే బిగ్ బాస్ పై నమ్మకం పోతుందని, వాపోతున్నారు. మెహబూబ్ చేసిన పనిపై ఇప్పటికే పలు ఫిర్యాదులు బిగ్ బాస్ నిర్వాహకులకు అందాయి. నిజానికి బిగ్ బాస్ షో దాదాపు 100కు పైగా దేశాలతో పాటు 120కు పైగా భాషల్లో ప్రసారం అవుతోంది. మరి ఇంతటి ఇంటర్నేషనల్ బ్రాండ్ షోలో ఇలా చవకబారు ట్రిక్స్ చేయడం వారి సంస్థ ఇమేజ్ ను డామేజ్ చేసేలా ఉన్నాయని నెటిజన్లు వాపోతున్నారు. అయితే ఎలాగైనా అఖిల్ కు న్యాయం చేయాలని, వారంతా కోరుతున్నారు. సొహైల్, మెహబూబ్ ప్లే చేసిన ట్రిక్ వల్ల బిగ్ బాస్ పై నమ్మకం పోయే ప్రమాదం ఉన్నట్లు అటు నిర్వాహకులు కూడా గుర్తించినట్లు సమాచారం. మరి ఈ విషయంపై అటు నాగార్జున కూడా కాస్త సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. మరి ముందు ముందు ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Bigg Boss 4 Telugu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు