హోమ్ /వార్తలు /సినిమా /

వంటలక్కకు పోటీ ఇస్తున్న తులసి.. కామెడీ షోలకు చుక్కలు చూపిస్తున్న సీరియల్స్

వంటలక్కకు పోటీ ఇస్తున్న తులసి.. కామెడీ షోలకు చుక్కలు చూపిస్తున్న సీరియల్స్

తెలుగు బుల్లి తెరపై తనకు తిరుగు లేదనుకున్న కార్తీక దీపానికి గట్టి పోటీ ఇస్తోంది మరో సీరియల్.. అది కూడా మాటీవీ నుంచే కార్తీక దీపానికి గట్టి పోటీ ఎదురవుతోంది. వారం వారం రేటింగ్ పాయింట్లను పెంచుకుంటోంది.. ఇంటింటినీ అలరిస్తోంది.

  తెలుగు బుల్లి తెరపై సీరియల్స్ట్ వార్ నడుస్తోంది. ముఖ్యంగా మిగిలిన ఛానెల్స్ అన్నింటినీ మా టీవీ పూర్తిగా వెనక్కు నెట్టేస్తోంది. మొన్నటి వరకు సీరియల్స్ రాజ్యాన్ని కార్తీక దీపం ఏకచత్రాధిపత్యంగా ఏలితే.. ఇప్పుడు ఆ సీరియల్ కు విపరీతమైన పోటీ పెరిగింది. ముఖ్యంగా ఇంటింటి గృహలక్ష్మి రూపంలో గట్టి పోటీ ఎదురవుతోంది..

  గత కొన్నేళ్లుగా తెలుగు సీరియల్స్ అంటే కార్తీక దీపం మాత్రమే.. ఏ ఇంట్లో చూసినా రాత్రి 7.30 గంటలు అయ్యింది అంటే మా టీవీ ఆన్ అయ్యి ఉండాల్సిందే.. అందులో కార్తీక దీపం సీరియల్ చూడాల్సిందే.. ముఖ్యంగా వంటలక్క డాక్టర్ బాబుల మధ్య సన్నివేశాలు మిస్ అవ్వడానికి తెలుగు రాష్ట్రాల్లో ఏ మహిళ మిస్ అవ్వడానికి ఇష్టపడరు.. ఒక వేళ మిస్ అయినా ఫోన్ చేసి మరీ విశేషాలు తెలుసుకోవడం.. లేదా తరువాత వెబ్ సైట్లలో ఆ వీడియో చూడనిదే నిద్రపోరు.. అంతలా తెలుగు ప్రేక్షకులపై ముద్ర వేసింది కార్తీక దీపం సీరియల్.. ఇప్పటి వరకు టీవీ రేటింగ్స్ చూస్తే కార్తీక దీపానికి దగ్గరగా ఏ ప్రోగ్రామం కనిపించేది కాదు.. కానీ ఇప్పుడు కార్తీక దీపంతో ఢీ అంటే ఢీ అంటోంది ఇంటింటి గృహలక్ష్మి సీరియల్.. కార్తీక దీపంలో వంటలక్క కోసం అభిమానులు ఎలా ఎదురు చూస్తున్నారో..? ఇంటింటి గృహలక్ష్మిలో తులసి కోసం కూడా అభిమానులు అలానే ఎదురు చూస్తున్నారు...

  అందుకు నిదర్శనం ఈ వారం రేటింగ్స్.. ఈ వారం స్టార్ మా ఛానెల్ 12 రేటింగ్స్ పాయింట్లు పెంచుకుని ఎప్పటిలానే 783 టీఆర్ పీ పాయింట్లతో నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచింది. ఇక జీ టీవీ ఒక రేటింగ్ పాయింట్ తగ్గినా.. 630 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ టీవీ 8 పాయింట్లు మెరుగుపరచుకుని 471 పాయింట్లతో మూడో స్థానంలో నిలవగా.. జెమిని రేటింగ్స్ రోజు రోజుకూ దిగజారుతున్నాయి.. అయితే మా టీవీ నెంబర్ వన్ ప్లేస్ లో.. జీ టీవీ 2 ప్లేస్ లో నిలవడానికి అందులో వచ్చే సీరియల్స్ ప్రధాన కారణం..

  ఈ వారం రేటింగ్స్ విషయానికి వస్తే మాటీవీ సీరియల్స్ మాత్రమే మొదటి 23 స్థానాల్లో నిలిచాయి. జీలో వస్తున్న త్రినయిని సీరియల్ 24వ స్థానంలో నిలిచింది. 59వ స్థానంలో ఈటీవీ న్యూస్ నిలిచింది. ఈ టీవీలో టాప్ రేటింగ్ దక్కించుకున్నది ఈ టీవీ న్యూస్ మాత్రమే. 150 స్థానాల వరకు ఎక్కడా జబర్దస్త్ కనిపించకపోవడం వివేషం.. ఈ కామెడీ షోకు రోజు రోజుకూ రేటింగ్ తగ్గుతూ వస్తోంది..

  మాటీవీ సీరియల్స్ ఇతర ఛానెళ్ల సీరియల్స్, ప్రొగ్రామ్స్ అందకుండా రేటింగ్స్ లో దూసుకుపోతున్నాయి. ఎప్పటిలాగే తొలి ఆరు స్థానాల్లో కార్తీక దీపం సీరియల్ నిలిచింది. వారం మొత్తం ఆరు ఎపిసోడ్ లు 15 నుంచి 17 రేటింగ్ పాయింట్లతో తొలి ఆరు స్థానాల్లో నిలిచాయి. అయితే ఈ సీరియల్ కు దగ్గరగా మరే ప్రోగ్రామ్ రేటింగ్స్ ఉండేవికావు.. కానీ ఇప్పుడు ఇంటింటి గృహలక్ష్మి గట్టి పోటీ ఇస్తోంది. ఆరు ఎపిసోడ్లు 12 టీఆర్పీ రేటింగ్ పాయింట్లు సాధించాయి.. దాదాపు కార్తీక దీపాన్ని ఎంతమంది చూస్తున్నారో.. అంతా ఇంటింటి గృహలక్ష్మిని ఫాలో అవుతున్నారు. సీరియల్ లో ఇదే ట్విస్టులు కంటిన్యూ చేస్తే కచ్చితంగా కార్తీక దీపం రేటింగ్స్ ను క్రాస్ చేసే అవకాశం ఉంటుంది.

  First published:

  Tags: Karthika deepam

  ఉత్తమ కథలు