హోమ్ /వార్తలు /సినిమా /

Adipurush: ఆదిపురుష్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. ఫ్యాన్స్ కు పండుగలాంటి వార్త!

Adipurush: ఆదిపురుష్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. ఫ్యాన్స్ కు పండుగలాంటి వార్త!

జనవరి 12, 2023 సంక్రాంతి సందర్భంగా ఆదిపురుష్ సినిమాను 3డిలో విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ అయిపోయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది చిత్రయూనిట్. రామాయణం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ఓం రౌత్. భారీ బడ్జెట్‌తో ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్‌పై చూడనటువంటి అత్యద్భుతమైన విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు.

Adipurush: టాలీవుడ్ పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు. వరుస సినిమాల్లో అవకాశాలు సొంతం చేసుకొని.. మొత్తం పాన్ ఇండియా సినిమాలకే పరిమితం అయ్యాడు.

  Adipurush: టాలీవుడ్ పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు. వరుస సినిమాల్లో అవకాశాలు సొంతం చేసుకొని.. మొత్తం పాన్ ఇండియా సినిమాలకే పరిమితం అయ్యాడు. బాహుబలి తర్వాత విపరీతమైన క్రేజ్ అందుకున్నాడు ప్రభాస్. ఇక ప్రభాస్ కోసం స్టార్ డైరెక్టర్ లే క్యూ కడుతున్నారు. ఇక ప్రభాస్ సినిమాలో నటించడానికి బాలీవుడ్ బ్యూటీస్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా నుండి మరో అప్ డేట్ అందగా.. అభిమానులకు పండగేనని అర్థమవుతుంది.

  ప్రస్తుతం ప్రభాస్ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'రాధేశ్యామ్' సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా త్వరలోనే విడుదల కానుంది. ఇక మరో పాన్ ఇండియా సినిమా 'సలార్'. ఈ సినిమా కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ బిజీలో ఉంది.

  ఇది కాకుండా మరో స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'ఆది పురుష్' సినిమాలో ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించగా, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుంది. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్, రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా అప్ డేట్ తో డైరెక్టర్ ముందుకు వచ్చారు.

  ఇక ఇప్పటికే ఈ సినిమా 30 శాతం పూర్తయిందని, గత సంవత్సరం ఈ సినిమాలోని ప్రధాన పాత్రధారుల ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీని పూర్తి చేశారని తెలిపారు. అంతే కాకుండా ఈ సినిమా కోసం ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్ మంచి ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ లోకి మారారని తెలిపారు. ఇక కృతి సనన్ తో పని చేయడం గొప్ప అనుభవని తెలిపారు. అయితే ఈ సినిమాకు సంబంధించి రేపు శ్రీ రామ నవమి సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేయబోతుంది చిత్రబృందం. ఏది ఏమైన ప్రభాస్ తన మూడు సినిమాల అప్డేట్ లతో అభిమానులకు సర్ప్రైజ్ ల మీద సర్ప్రైజ్ లు ఇస్తున్నాడు.

  Published by:Navya Reddy
  First published:

  Tags: Adipurush film, Bollywood, Kruthi sanan, Om Raut, Pan india film, Prabhas, Saif Ali Khan, Srirama navami, Tollywood

  ఉత్తమ కథలు