• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BIG TWIST IN BIGG BOSS 4 TELUGU AKHIL VS ABHIJEET BIGG BOSS 4 TELUGU MONAL CONSPIRACY MK

Bigg Boss: మోనల్ చేసిన పనికి అఖిల్ ఔట్..ముద్దులు...హగ్గుల వెనుక పెద్ద కుట్ర...మహానటీ అంటున్న నెటిజన్లు..

Bigg Boss: మోనల్ చేసిన పనికి అఖిల్ ఔట్..ముద్దులు...హగ్గుల వెనుక పెద్ద కుట్ర...మహానటీ అంటున్న నెటిజన్లు..

బిగ్ బాస్ 4 తెలుగు మోనాల్ అఖిల్ (Monal Akhil Bigg Boss 4 Telugu)

మోనల్ పై సోషల్ మీడియాలో అఖిల్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మోనల్ వల్ల అఖిల్ ఇమేజ్ డ్యామేజ్ అవుతోందని, గతంలో పునర్నవి, రాహుల్ మధ్య ఉన్న కెమిస్ట్రీ వీరిద్దరి మధ్య కనిపించకపోయినా, మోనల్ మాత్రం ప్రేమ అంటూ అవసరం ఉన్నా, లేకున్నా హగ్గులతోనూ, కిస్సులతో రెచ్చిపోయింది.

  • Share this:
    బిగ్ బాస్ ఇఫ్పటికే చివరి అంకానికి చేరుకుంటోంది. ఇక మిగిలిన కంటెస్టెంట్స్ పూర్తి ఎనర్జీ పెట్టి ఆడేస్తున్నారు. ముఖ్యంగా టాస్కుల విషయంలో దయా దాక్షిణ్యాలు లేకుండా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో అరియానా ఇఫ్పటికే తానేంటో చెప్పేసింది. తనకు టాస్క్ తప్ప మరో ధ్యాస లేదని ఖరాఖండిగా చెప్పేసింది. అయితే తాజాగా బుధవారం జరిగిన టాస్క్ లో అఖిల్ ను ఔట్ చేసినట్లే చేసి అతడిని పొరగింట్లో పెట్టి బిగ్ బాస్ పెద్ద డ్రామాకు తెరలేపాడు. దీంతో అఖిల్ కొద్ది రోజుల పాటు అక్కడ ఉండి మిగితా కుటుంబ సభ్యులపై ఓ కన్నేసే అవకాశం ఉంది. ముఖ్యంగా తన క్లోజ్ మేట్ మోనల్ నిజస్వరూపం ఏంటో తెలుసుకునేందుకు అఖిల్ కు వీలు దక్కింది. అయితే మోనల్ మాత్రం ఏ మాత్రం డ్రామా తగ్గకుండా ఏడుపుతోనే ఎపిసోడ్ నడిపించింది. అయితే మిగిలిన హౌస్ మేట్స్ కు మాత్రం ఇదంతా బిగ్ బాస్ టాస్క్ లో భాగం అనే భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మోనల్ మాత్రం కాస్త ఓవర్ గా రియాక్ట్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు. అయితే అభిజిత్ మాత్రం బిగ్ బాస్ చేసిన ట్రిక్ ముందే గుర్తు చేసినట్లు తెలుస్తోంది. అటు బిగ్ బాస్ బుధవారం ఎపిసోడ్ లో హౌస్ లో సెంటిమెంట్ నింపే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం పొద్దున్నేఆశ పాశం అంటూ కేరాఫ్ కంచర పాలెం పాట వేసి వారందరినీ నిద్రలేపాడు. దీంతో అందరు కన్నీళ్లతో నిద్రలేచారు. ఇక మోనల్ మాత్రం పూర్తిగా తనలోని మహానటిని నిద్రలేపి జీవించేసింది. అయతే అభిజిత్ మాత్రం చాలా ఇంటెలిజెంట్ గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చేవారం కెప్టెన్సీ కోసం ట్రై చేస్తున్న అఖిల్ సడెన్ గా బయటకు వెళ్లడం వెనుక ఏదో కుట్ర ఉందని భావించాడు. దీంతో అతడు ఖచ్చితంగా పొరుగింట్లో ఉన్నాడని అర్థం చేసుకున్నాడు. అదే మాట లాస్యతో కూడా ఇండైరక్టుగా అన్నాడు.

    ఇదిలా ఉంటే మోనల్ పై సోషల్ మీడియాలో అఖిల్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మోనల్ వల్ల అఖిల్ ఇమేజ్ డ్యామేజ్ అవుతోందని, గతంలో పునర్నవి, రాహుల్ మధ్య ఉన్న కెమిస్ట్రీ వీరిద్దరి మధ్య కనిపించకపోయినా, మోనల్ మాత్రం ప్రేమ అంటూ అవసరం ఉన్నా, లేకున్నా హగ్గులతోనూ, కిస్సులతో రెచ్చిపోయింది. ఇక అఖిల్ పొరిగింట్లో ఉన్న సమయంలో చూస్తున్నాడన్న సంగతి గ్రహించిన మోనల్ మరింత ఓవర్ యాక్షన్ కు దిగింది. అఖిల్ పడుకున్న బెడ్ మీద ఉన్న దిండును ముద్దాడుతూ రెచ్చిపోయింది. అయితే అటు అఖిల్ ఫ్యాన్స్ మాత్రం మోనల్ వల్లనే మనోడి ఇమేజ్ చాలా డ్యామేజ్ అయ్యిందని, నిజానికి మోనల్ కేవలం అఖిల్ తో చేస్తున్న రొమాన్స్ వల్లనే ఇంకా హౌస్ లో ఉందని లేకుంటే ఎప్పుడో పెట్టే బేడా సర్దుకొని పోవడం ఖాయమని చెబుతున్నారు. ఇకనైన అఖిల్ నిజం గ్రహించి మోనల్ ను అవాయిడ్ చేసి టాస్క్ ల మీద కాన్సన్ట్రేట్ చేస్తే మంచిదని భావిస్తున్నారు.
    Published by:Krishna Adithya
    First published:

    అగ్ర కథనాలు