Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట.. ఈ టైటిల్ అనౌన్స్ చేసిన రోజు నుంచి మహేష్ బాబు అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. కొన్ని సినిమాలపై తెలియకుండానే ఏదో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. అలాగే సర్కారు వారి పాటపై కూడా ఉన్నాయి.
సర్కారు వారి పాట.. ఈ టైటిల్ అనౌన్స్ చేసిన రోజు నుంచి మహేష్ బాబు అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. కొన్ని సినిమాలపై తెలియకుండానే ఏదో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. అలాగే సర్కారు వారి పాటపై కూడా ఉన్నాయి. ఈ సినిమా టైటిల్‌పై ముందు నుంచి కూడా మంచి పాజిటివ్ టాక్స్ వస్తున్నాయి. అదిరిపోయే టైటిల్ పట్టాడు.. సినిమా కూడా అలాగే ఉంటుందంటూ పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఈ సినిమా షూటింగ్ మొన్నే దుబాయ్ షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చారు. తర్వాత గోవాలో మరో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు పరశురామ్. బ్యాంకింగ్ సెక్టర్లో ఆర్థిక నేరాల చుట్టూ కథ అల్లుకుంటున్నాడు ఈ దర్శకుడు. ఇందులో తన తండ్రిపై మోపబడిన దొంగతనం కేసును కొడుకు ఎలా తుడిచేస్తాడు.. ఆ నేరం చేసిన వాన్ని ప్రభుత్వానికి ఎలా పట్టిస్తాడు అనేది కథ అని తెలుస్తుంది. మహేష్ బాబు ఈ సినిమా కోసం తనను తాను గెటప్ పరంగానూ చాలా మార్చుకున్నాడు. అతిథి సినిమాలో కనిపించినట్లే ఇందులో కూడా లాంగ్ హెయిర్‌తో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్స్ చూసి పిచ్చెక్కిపోతున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి తాజాగా మరో అప్ డేట్ బయటికి వచ్చింది. ఇందులో మరోసారి అదిరిపోయే స్టెప్పులు వేయబోతున్నాడు మహేష్ బాబు. సాధారణంగా ఈయన సినిమాల్లో డాన్సులు తక్కువగానే ఉంటాయి. చాలా ఏళ్ళ కిందే డాన్సులు చేయడం మానేసి ఉన్నచోటే కాలు కదపడం అలవాటు చేసుకున్నాడు సూపర్ స్టార్. అభిమానులు కూడా దానికే అలవాటు పడిపోయారు.
మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు (mahesh babu anil ravipudi)
అలాంటిది గతేడాది వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో చాలా ఏళ్ళ తర్వాత మహేష్ బాబుతో అదిరిపోయే డాన్సులు చేయించాడు కొరియోగ్రఫర్ శేఖర్. దర్శకుడు అనిల్ రావిపూడి పట్టుబట్టి మరీ మహేష్ బాబుతో లుంగీ డాన్స్ చేయించాడు. మైండ్ బ్లాక్ పాటను ఎప్పటికీ సూపర్ స్టార్ అభిమానులు మరిచిపోలేరు. ఇప్పుడు కూడా పరశురామ్ సినిమాలో అలాంటి డాన్స్ నెంబర్ ఒకటి ప్లాన్ చేస్తున్నాడు శేఖర్ మాస్టర్.
మహేష్ బాబు కీర్తి సురేష్ (Mahesh Babu Keethi Suresh)
మహేష్ బాబుకు ఒక్కసారి కనెక్ట్ అయితే అంత త్వరగా ఎవర్నీ వదలడు. ఇప్పుడు శేఖర్ మాస్టర్ కనెక్ట్ అయ్యాడు. అందుకే ఆయనతోనే మరో పాట చేస్తున్నాడు. ఇప్పటికే ఈ పాట రికార్డింగ్ కూడా అయిపోయింది. షూటింగ్ చేయడమే తరువాయి. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. కచ్చితంగా సర్కారు వారి పాట మాస్ నెంబర్ కూడా అభిమానులను గుర్తుంచుకుంటారని ధీమాగా చెప్తున్నారు మేకర్స్.